Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » డయాబెటిస్ ఉన్నవారిలో వచ్చే సాధారణ నోటి సమస్యలు…
dental

డయాబెటిస్ ఉన్నవారిలో వచ్చే సాధారణ నోటి సమస్యలు…

apanalysisBy apanalysisOctober 10, 2014Updated:May 4, 2026No Comments3 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
డయాబెటిస్ అన్ని అవయవాలను ప్రభావితం చేసినట్లే… పళ్లనూ చేస్తుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు గుండె, రక్తపోటు విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లే… పళ్ల విషయంలోనూ అంతే శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారికి రోగనిరోధకశక్తి తక్కువ . దాంతో నోటిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పైగా చిగుళ్ల వ్యాధిలో నొప్పి తెలియదు. దీనికి తోడు డయాబెటిస్ ఉందంటే చిగుళ్ల వ్యాధులు వచ్చేందుకు అన్ని రకాల అవకాశాలుంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు నోరు, దంతాల విషయంలో ఎలాంటి జాగ్ర త్తలు పాటించాలన్న అవగాహన కోసం ఈ కథనం.
డయాబెటిస్ ఉన్నవారు డెంటిస్ట్ వద్దకు వెళ్లినప్పుడు తమకు డయాబెటిస్ ఉందన్న సంగతి తప్పనిసరిగా చెప్పాలి. డయాబెటిస్ కు వాడుతున్న మందులు, వ్యాధి నియంత్రణలో ఉన్నదా అన్న విషయం డెంటిస్ట్కు వివరించాలి. డయాబెటిస్ మందులతో పాటు వారు వాడే ఇతర మందులు అంటే రక్తాన్ని పలుచబార్చే మందుల వంటి వాటి వివరాలతో పాటు రోగి తాలూకు పూర్తి మెడికల్ హిస్టరీ ని వివరించాలి.
డయాబెటిస్ రోగుల్లో వచ్చే సాధారణ నోటి సమస్యలు…
  • తరచూ నోరు తడారిపోవడం: సాధారణంగా నోరు ఎప్పుడూ తడిగా ఉంటుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారిలో మాత్రం నోరు పొడిబారిపోతూ ఉండటం చాలా సాధారణం. ఈ పరిస్థితిని ‘జీరోస్టోమియా’ అంటారు. ఇలా నోటిలో తగినంత లాలాజలం లేనప్పుడు బ్యాక్టీరియా అంతా ఒకచోట గూడుకట్టినట్లుగా పెరుగుతుంది. దీన్ని కాలొనైజేషన్ అంటారు. ఇలా జరగడం వల్లనే చాలామంది షుగర్ రోగుల్లో నోటి దుర్వాసన చాలా సాధారణం. ఇలా నోరు పొడి బారడం అన్నది దీర్ఘకాలం పాటు కొనసా గితే అది నోటిలోని మృదుకణజాలం (సాఫ్ట్ టిష్యూస్) దెబ్బతినేలా చేస్తుంది. దాంతో పాటు దంతక్షయం, పంటినొప్పి వంటి సమస్యలు వస్తాయి. జీరోస్టోమియా అనే సమస్య కాస్త వయసు పైనబడినవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో మరికాస్త ఎక్కువ. మనం తిన్న ఆహార పదార్థాలను గొంతులోకి సులువుగా జారుతూ వెళ్లేలా చేయడానికి లాలాజలం అవసరం. నోటిలో తగినంత లాలాజలం లేకపోతే పళ్లు పుచ్చిపోవచ్చు, చిగుళ్ల వ్యాధులతో పాటు మాట్లాడటంలో ఇబ్బంది, మింగలేకపోవడం, గొంతు బొంగురుపోవడం, నోటిలో మంట, ముక్కు పొడిబారడం వంటి సమస్యలు కూడా రావచ్చు. దీర్ఘకాలంపాటు నోరు పొడిబారిపోయినట్లుగా ఉండే చక్కెర రోగులు తప్పనిసరిగా దంతవైద్యులను కలవాలి. వారు నోరు పొడిబారకుండా ఉండేందుకు కొన్ని చికిత్సలు చేస్తారు. వాటితో పాటు కొన్ని పుక్కిలించే ద్రవాలు, ఫ్లోరైడ్ ఉండే పూతమందులను సైతం సూచిస్తారు. చక్కెర లేని గమ్స్, చక్కెర రహిత మింట్ వంటి వాటిని నములుతూ ఉండటం వల్ల నోటిలో తగినంత లాలాజలం ఊరుతుంటుంది. ఇక కొద్ది కొద్ది సేపటికి ఒకసారి చిన్న చిన్న గుటక వేస్తూ మంచినీళ్లు తాగడం కూడా మేలు చేస్తుంది. ఫ్రిజ్లోని ఐస్ ముక్కల ను తీసుకుని చప్పరించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక నోరు పూర్తిగా పొడిబారి పోయేవారు కాఫీ, కూల్ డ్రింక్స్ వంటి  కెఫిన్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ కాఫీ తాగే అలవాటు ఉంటే, చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి.
  • నోటికి రుచి తెలియకపోవడం: ఇంతకు ముందులా ఇప్పుడు తమ నోటికి రుచి తెలియడం లేదంటూ చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఫిర్యాదు చేస్తుంటారు. అందుకే వారు ఆహార పదార్థాలను మరింత రుచికరం చేసుకోవడం కోసం రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకుంటుంటారు. దాంతో వారి పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.  పైగా ఈ తరహా ఆహారం వల్ల నోటిలో మరింతగా బ్యాక్టీరియా చేరుతుంది. అది చేరుతున్న కొద్దీ దంతక్షయం, పంటినొప్పి వంటి సమస్యలూ పెరుగుతాయి. అందుకే రుచి తెలిసినా, తెలియకపోయినా ఆహారం విషయంలో డయాబెటిస్ రోగులు తమ పరిమితులను పూర్తిగా పాటించాలి. కార్బోహైడ్రేట్ ఆహారాన్ని, కొవ్వుపదార్థాలను పరిమితంగా తీసుకుంటూ, పుష్టికరమైన ప్రోటీన్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.
  • ఓరల్ క్యాండిడియాసిస్: ఇది నోటిలో వచ్చే ఒకరకం ఫంగల్ ఇన్ఫెక్షన్. నోటిలో డెంచర్స్ వాడేవాళ్లతో పాటు డయాబెటిస్ రోగుల్లోనూ ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ వ్యాధి వచ్చినవారు దంతవైద్యుల సలహా తో యాంటీ ఫంగల్ మందులను వాడాల్సి ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నవారు నోటి పరిశుభ్రతను పాటించడం అవసరం.

 అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నవారు సైతం ప్రతి ఆర్నెల్లకు ఒకసారి డెంటిస్ట్ను కలిసి క్లీనింగ్ వంటి సాధారణ ప్రక్రియలు చేయించుకోవాలన్నది దంతవైద్యులు చేసే సిఫార్సు. అలాంటిది ఒకవేళ డయాబెటిస్ కూడా ఉంటే వారు తరచూ దంతవైద్యనిపు ణులను కలిసి తమ పళ్లు పరీక్షింపజేసుకోవ డం చాలా అవసరం.

చక్కెరతో దంతాలపై ప్రభావం ఇలా…
మనం ఆహారం తీసుకున్నప్పుడు నోట్లో మిగిలి పోయిన ముక్కల నుంచి బ్యాక్టీరియా పెరిగి అది దంతాలపై పాచి (ప్లాక్)లా ఏర్పడుతుంది. మన ఆహారంలో తీపి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ గా ఉంటే ఈ బ్యాక్టీరియా పెరుగుదల మరీ ఎక్కువ. వాటి నుంచి యాసిడ్స్ తయారై, అవి పంటిపై దుష్ర్పభావం చూపడం వల్ల పంటి ఎనా
మిల్ దెబ్బతింటుంది. ఇది అదేపనిగా జరగడం వల్ల పంటి ఎనామిల్లో పగుళ్లు వచ్చి అవే పంటిలో ని క్యావిటీస్గా ఏర్పడతాయి. చక్కెర వ్యాధి అదుపులో లేనివారిలో బ్యాక్టీరియా మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. దాంతో పాచి కాస్తా ‘గార’ (టార్టార్)గా మారి చిగుళ్ల వద్ద, పంటికీ పంటికీ మధ్య దీర్ఘకాలికంగా ఉండిపోతుంది. అది అలా ఉండిపోవడం వల్ల క్రానిక్ (దీర్ఘ కాలిక) ఇన్ఫెక్షన్స్కు, ఇన్ఫ్లమేషన్కు దారితీయవచ్చు.
Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

మ‌ధుమేహం అదుపు మ‌న చేతుల్లో‌నే

May 6, 2026

ఈ ఫుడ్స్ తింటే కళ్ళు బాగా కనిపిస్తాయట..

May 5, 2026

యాంటీ ఆక్సిడెంట్స్

December 19, 2015

కంప్యూటర్ ముందు ఎక్కువగా పనిచేస్తుంటే…

December 19, 2015

దంత సమస్యలు రాకుండా…

December 19, 2015
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.