Author: apanalysis
చాలామంది ఇంట్లోనే తలకు రంగు (హెయిర్ డ్రై) వేసుకుంటూ ఉంటారు. కాని సరైన జాగ్రత్తలు పాటించ కపోతే చర్మసమస్యలు ఎదురవ్వవచ్చు. అందుకని… జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు అది చర్మానికి తగలకూడ జాగ్రత్తగా వేసుకోవాలి. ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్ లేదా నూనె రాసుకొని తర్వాత డై వేసుకోండి. తలంటుకు నేటప్పుడు కూడా డై చర్మానికి తగలకుండా జాగ్రత్తపడాండి. అలాగే డైఎంపికలో నాణ్యత విషయంలో రాజీ పడకండి. ఇక జుట్టు మంచి వాసన రావాలంటే హెయి సీరమ్ లేదా హెయిర్ స్ప్రేలను వాడవచ్చు. అయితే ఈ సీరమ్స్, స్ప్రేలు మాడుకు, జుట్టు కుదుళ్లకు తగలకుండా జాగ్రత్తగా వాడండి లేదంటే వీటిలో ఉండే గాఢ రసాయనాలు వెంట్రుక కుదురును దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి.
బ్యూటీపార్లర్ లో ఫేసియల్ చేసేటప్పుడు ముఖానికి ఆవిరిపట్టడం (స్టీమ్) చూస్తుంటాం. అయితే ఆవిరి ఎంత సమయం పట్టాలి? ఎలా పట్టాలి? అసలు ఆవిరిపట్టడం వల్ల ఉపయోగాలేమిటో ముందు తెలుసుకుంటే మనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి. ముఖచర్మానికి దగ్గరగా ఆవిరి వేడి తగలకూడదు. షవర్ బాత్ చేసేటప్పుడు నీరు ఎంత దూరం నుంచి పడుతున్నాయో అంత దూరం నుంచి ఆవిరి చర్మానికి తగలాలి. లేదంటే చర్మం తన సహజత్వాన్ని కోల్పోవడానికి ఆవిరి ప్రధాన కారణం అవుతుంది. ఐదు నిమిషాలకుమ ఇంచి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలను ఒకేలా ఉండవు. అందుకని అందరికీ ఒకేవిధంగా ఆవిరిపట్టడం సరైన విధానం కాదు. దీని వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంధులు పొడిబారుతాయి. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం అవుతుంది. ఆవిరి పట్టిన తర్వాత క్లెన్సర్ తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల పోర్స్ లో…
ముఖం, జుట్టు సంరక్షణతో పాటు గోళ్లను కూడా కాపాడుకోవాలి.కాల్షియం, విటమిన్-ఎ ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. చేతులు కడుక్కున్న ప్రతిసారి మోచేతుల నుంచి గోళ్ల చివర్ల వరకు నీళ్లలో శుభ్రం చేయాలి. హాండ్ లోషన్ ని ఇంట్లో రెడీగా ఉంచుకుని చేతులు నీటిలో నానినప్పుడల్లా రాసుకోవాలి. వీలయినప్పుడు గోళ్లకు నూనెతో మసాజ్ చేస్తే గోళ్లు బలంగా దృఢంగా ఉంటాయి. ఇంటిపనులు, తోటిపని చేసేటప్పుడు గ్లవ్స్ ధరించడం మరిచిపోవద్దు. బాగా వేడిగా ఉన్న నీటిని చేతులకు తగలనివ్వద్దు. పదునైన మెటల్ పరికరాలను ఉపయోగించి గోళ్లను శుభ్రం చేయవద్దు. గోళ్లను శుభ్రం చేయటానికి నెయిల్ బ్రష్ ని, ఆరంజ్ స్టిక్ గాని వాడాలి. గోళ్లు పగిలి బీటలు వారితే కొన్నాళ్లు పాటు నెయిల్ పాలీష్ వేసుకోకూడదు. గోరు పై వాడే నెయిల్ కట్టర్ లేదా నెయిల్ సిజర్ ను శుభ్రంగా ఉంచితే ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటాయి. డబ్బాల మూతలు తీయటానికి, ఫోన్ నంబర్ రింగ్ చేయటానికి గోళ్లను ఉపయోగించకూడదు. చేతులను ఎక్కువసేపు డిటర్జెంటులో నానపెట్టకూడదు.
తలనొప్పి ఒక వ్యాధి కాదు. వివిధ శారీరక, మానసిక రుగ్మతల్లో వ్యక్తమయ్యే లక్షణమే. తల, మెదడుకు సంబంధించిన బాహ్య, అభ్యంతర, స్థానిక కారణాలవలన కొన్ని విధాలైన తల నొప్పులు సంభవిస్తే, ఇతర శరీర భాగాల్లో వ్యాధిగ్రస్తమైన అవయవాల ప్రభావం తాలూకు లక్షణాల్లో ఒకటిగా తలనొప్పి వస్తుంది. కొన్ని తలనొప్పులు దైనందిన కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తే, మరి కొన్ని ప్రాణాంతకంగా కూడా తయారవుతుంటాయి. ఏది ఏమైనా తలనొప్పులకు సంబంధించిన ప్రాథమిక అవగాహనను ఏర్పరచుకుంటే, దానిని ఎదుర్కో వడటం అంత కష్టతరం కాదు. తలకు ఇరుపక్కలా నొప్పిగా, బరువు పెట్టినట్లు, బిగించినట్లు కొందరిలో తలనొప్పి వస్తుంది. ఆందోళన, ఆతృత, మనో వ్యాకులత, ఎప్పుడూ తన ఆరోగ్యం గురించి అతిగా చింతిస్తుండటం మొదలైన కారణాల వలన వచ్చే ఇలాంటి తలనొప్పిని టెన్షన్ హెడ్ ఎక్ డి వ్యవహరిస్తారు. జీవన శైలిలో మార్పులు చేసుకుని, మానసిక ప్రశాంతత అలవరచుకోవడం, యోగ, ధ్యానంలాంటి ప్రక్రియలు వీరికి బాగా ఉపయోగపడుతాయి. మనం…
ఇతర కార్బొనేటెడ్ పానియాలకంటే టీ ఆరోగ్యకరం. మీకు కావల్సిన రుచులలో , వివిధ రకాల ఫ్లేవర్స్ లో టీ తయారు చేసుకొని త్రాగవచ్చు . ఉదా: హెర్బల్ టీ, లెమన్ టీ, హనీ టీ, ఆరంజ్ టీ, యాపిల్, హనీ టీ, ఐస్డ్ టీ, అల్లం టీ ఇలా అనేక రకాల టీలను తయారుచేసుకోవచ్చు.టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది . ఇది శరీరంలోని ఆక్సీకరణ ప్రక్రియ నియంత్రణ మరియు ప్రారంభ వృద్ధాప్యం నిరోధించడానికి సహాయపడుతుంది.టీ రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలో నీరు(తేమ)సమతౌల్యానికి కొనసాగించడానికి సహాయపడుతుంది. మీకు కావల్సిన హైడ్రేషన్ ను అంధిస్తుంది.ఒక కప్ప టీ త్రాగడం వల్ల మీ శరీరం ఉత్తేజం పరుస్తుంది. ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అందుకు కారణం ఇందులో ఉండే కెఫిన్. అయితే కెఫిన్ కాఫీలో కంటే టీలో తక్కువ. అయితే కూడా ఇది మన శరీరం మీద సున్నిత ప్రభావాన్ని చూపెడుతుంది.టీ, ముఖ్యంగా గ్రీన్ టీ…
ప్రస్తుతకాలంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు బరువు అన్నది పెద్ద సమస్యగా మారింది. నేటి జంక్‌ఫుడ్, బిజీ లైఫ్, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, వండుకునే సమయం లేకపోవడం. ఇలాంటి అనేక కారణాల చేత అంతకంతకూ స్థూలకాయ సమస్య పెరిగిపోతుంది. మరి దీన్నుండి బయటపడాలంటే ఏం చేయాలి.అదీ నీరసం రాకుండా… సౌందర్యానికి ఆపద వాటిల్లకుండా! ఎందుకంటే, డైటింగ్ పేరిట పస్తులుండి ఆసుపత్రుల పాలవుతున్న అమ్మాయిలను మనం చూస్తున్నాం. ఆహారంలో ఈ క్రింది వాటిని భాగంగా చేస్తే ఎలాంటి కొవ్వు లేకుండా పోషకాహారం మీ శరీరానికి అందిస్తున్నట్లే! నాజూగ్గా మారడానికి ఇది ఒక చక్కటి మార్గం. బరువు తగ్గాలంటే ఈవిధంగా మీరు ఆచరించండి మొదటి రోజు : ఆపిల్, కమల, దానిమ్మ, బత్తాయి, జామ, మొదలైన రకాల పండ్లను మూడు పూటలా ఆహారముగా తీసుకొనకొండి, అందులోను పుచ్చకాయ, తినే దోసకాయను ఎక్కువగా తీసుకొండి. అరటిపండు మాత్రము తినకండి రెండవ రోజు : ఉదయాన్నే ఫలాహరముగా బంగాళ దుంపలను…
రోజుకి 8-10 గ్లాసులు నీళ్ళు తాగండి. నీరు ఎక్కువగా తాగడం వల్ల మీ శరీరంలోని మలినలు, వ్యాధి కారక క్రిములు బయటకు పోతాయి. రోజూ మీ ముఖాన్ని 2-3 సార్లు ఒక మంచి ” ఫేస్ వాష్” తో శుబ్రం చేసుకోండి, ఎక్కువగా చేసుకోవడం మంచిది కాదు. సహజమైన స్క్రబ్స్ ఉపయోగించి మీ చర్మాన్ని వారానికి 2-3 సార్లు శుభ్ర పరచుకుండి. దీని వల్ల చనిపొయిన చర్మ కణాలు తొలగిపొయి, కొత్త కణాలు వస్తాయి. వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదు, దాని వల్ల చర్మం పొడిబారిపోయే ప్రమాదం ఎక్కువ. ఎక్కువగా మీ ముఖమును, చేతులతో తాకవద్దు, ఎందుకంటే మీ చేతులకు ఉన్న మురికి వల్ల మొటిమలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సాద్యమైనంతవరకు సహజంగానే ఉండండి, కాస్మటిక్స్ వాడకం తగ్గించడం ఎంతో అవసరం. మీ చర్మము జిడ్డుగల చర్మం అయితే ఎక్కువగా పౌడర్ రాయడం మంచిది. కాలనికి అనుగుణంగా మీ…
జుట్టు నల్లగా లేదని బాధపడటం సహజమే. ఆహార నియమాలు పాటించక పోవడం, విశ్రాంతి లేమి ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతుడంతో జుట్టు నల్లగా కాకా నిర్జీవంగా కనపడుతోంది. ఇక నల్లని జుట్టు కోసం యువకులు కూడా టెన్షన్ పడుతున్నారంటే అశ్చయపడవలసిన విషయామే కాదు. ఇక స్త్రీల విషయంలో ఇది మరీ ఎక్కువగా కనపడుతోంది. నల్లని జుట్టు కోసం ఏ హెయిర్ డై వాడాలో తెలియక సతమతమవ్వాల్సిన అవసరంలేదు. మీ ఇంట్లోనే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి. అరలీటరు నీటిలో రెండు చెంచాల ఉసిరిపొడి కలపి, నిమ్మకాయని సగంగా కోసి, ఆ రసాన్ని నీటిలో కలపండి, ఈ మిశ్రమాన్ని రోజూ మీ తలకు రాసుకుని తలస్నానం చేస్తే అతి తక్కువ సమయంలో, అందమైన నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది. మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చికోవాలి అనుకున్న, లేదా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రాకుండా ఉండాలన్నా మామిడి యొక్క రసాన్ని…
యాంత్రిక జీవన శైలి నానాటికీ పెరిగిపోతుది. దీని కారణంగా మనలో చాలా మంది ఒత్తిడి బారిన పడుతున్నారు. అయితే ఎంత ఒత్తిడి కలిగినా దాని నుండి బయట పడే మార్గాలైతే ఎవరూ ఆచరించలేకపోతున్నారు. ఏది ఎమైనా చివరకు స్ట్రెస్స్ మన చెంతే ఉంటోంది. నాగరికత పెరిగే కొద్దీ జీవన శైలిలో మార్పుల కారణంగా ఒత్తిడి సాధారణమైపోయింది. వివిధ కారణాల రీత్యా ఏర్పడే మానసిక ఒత్తిడి నుంచీ బయట పడాలంటే ఈ చిట్కాలను ట్రై చేయండి. అవేంటో చూద్దామా..రుచికరమైన పదార్ధలు తినటం వల్ల మనకు జిహ్వ పై ఉన్న నరాలలో ఉత్తేజం ఏర్పడి తొందరగా ఫ్రెష్ అవుతాం. ఇందులో సందేహమే లేదు. అందుకే ఒత్తిడిలో ఉన్నప్పుడు మీకు నచ్చిన వంటకాన్ని వెరైటీగా ట్రై చేసి చూడండి.ప్రకృతి ఒడిలో ఎంత సేపైన సేద తీరవచ్చు. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు తోటపని చేయటం మంచిది. తోటపని మిమ్మల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. ప్రకృతికి చేరువైతే మీ…
తమ భావోద్రేకాలు నియంత్రించుకొంటూ సరైన మార్గంలో వినియోగించుకోగలిగిన వాళ్ల జీవితాలు ప్రశాంతంగా, విజయవంతంగా ఉంటాయి. అది చేతగాని వారికి జీవితంలో అపజయాలు అధికమవుతుంటాయి. మనకు ఇష్టమైన రీతిలో మన అభిప్రాయాలు ఏర్పరచుకొంటూ ఉంటాం. ఎదుటి వ్యక్తులు మన అభిమతానికి అనుకూలంగా మెలగనప్పుడు, పరిస్థితులు సహకరించనప్పుడూ మనలో అసహనం, అసంతృప్తి చోటు చేసుకొంటాయి. ఎమోషన్స్ విజృంభిస్తాయి. ప్రతి మనిషినీ, ప్రతి పరిస్థితినీ మనం ఆశించిన విధంగా మార్చుకోవాలనీ ప్రయత్నం చేస్తూ ఇబ్బందుల పాలయ్యే బదులు, మన వ్యక్తిత్వాన్ని సరిదిద్దుకోవడం తేలికైన పని. తెలివైన పని కూడా. కొన్ని పరిస్థితులను మార్చడానికి వీలుకాకపోవచ్చు. కష్టం కావచ్చు. కాని, మన ఆలోచనలను, అభిప్రాయాలను సందర్భోచితంగా మార్చుకోవడం, సమయోచితంగా వ్యవహరించడం మన చేతుల్లో ఉన్న పని.ఆవేశాలను నిరోధించుకోవడం, నియంత్రించుకోవడం మనకు చేతనైన పని. అన్ని వేళలూ, అన్ని పరిస్థితులూ మనకు అనుకూలంగా ఉండవు. విషమ పరిస్థితులు ఎదురైనప్పుడు ఆవేశాలు ప్రదర్శించి అనర్థాలు కొని తెచ్చుకోవడం కంటే, సమయానుకూలంగా…
