Author: apanalysis
జనాభాలో సుమారు 10 శాతం దంపతులు సంతానం కలగక బాధపడుతూ వుంటారు. ప్రపంచ జనాభాలో 80 మిలియన్ల దంపతులు సంతానం కలగని వారని ఒక అంచనా. సంతానం కలగనప్పుడు దంపతులిద్దరూ డాక్టరుకి చూపించుకున్నప్పుడు ఎవరిలో లోపం వున్నదీ వెంటనే తెలుస్తుంది. దాని బట్టి రెండవవారికి వైద్య పరీక్షలు అనవసరంగా జరపడం వుండదు. దీని వల్ల ధనం, సమయం రెండూ కలసివస్తాయి. స్త్రీకి 20-30 సంవత్సరాల వయసులో గర్భం వస్తుంది. ఆపైన గర్భం రావడం తక్కువ. సాధారణంగా పురుషునిలో ఇటువంటి పరిస్థితి కనబడదు. పురుషుడు ఏ వయస్సులో పాల్గొన్నా అతనివల్ల గర్భం మామూలుగానే వస్తుంది.రతిలో ఎక్కువసార్లు పాల్గొనేవారిలో గర్భం త్వరగా వస్తుంది. తక్కువ పాల్గొనేవారిలో గర్భం రావడం ఆలస్యం అవుతుంది. వారానికి ఒకసారే రతిలో పాల్గొంటే ఆరునెలల్లో గర్భం వచ్చేవారు 1-2 సార్లు రతిలో పాల్గొనే దంపతులలో 6 నెలలలోగా గర్భం దాల్చేవారు 32 శాతం మంది వుంటారు. వారానికి 2-3 సార్లు…
కొంతమంది లైంగిక జీవితం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తమకు తగినంత లైంగికానందం కలగడం లేదని, అసలు తన భాగస్వామిని ఎంత ప్రేరేపించినా స్పందించడం లేదని బాధపడి పోతుంటారు. వాస్తవానికి ఇది లైంగిక పరమైన సమస్య కాదు. ఇతరేతర సమస్యలే అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఒకరు సెక్స్‌కి సిద్ధపడి రెండోవారు అది ఇప్పుడు ఇష్టం లేదు అని అంటున్నారంటే, దాని వెనుక మరేదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.పడక గదికి చేరిన తర్వాత మనసులో సెక్స్ కోరికలు తప్ప మరే కోరికలకు చోటివ్వరాదు. అలా ఉండటానికి స్త్రీపురుషులిద్దరూ ప్రయత్నించాలి. ఏవైనా సమస్యలుంటే పడక గది బయటే చర్చించుకుని వాటిని అక్కడే వదిలివేయాలి. ఆ సమస్యలను చర్చించేందుకు సెక్స్ సమయాన్ని వాడుకోకూడదు. ఎందుకంటే ఆనందకరమైన, సంతృప్తికరమైన సెక్స్ అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.భాగస్వామిలో సెక్స్ అలజడులను రేపేందుకు ఎక్కడ స్పర్శిస్తే స్త్రీపురుషుల్లో స్పందన కలుగుతుందో తెలుసుకుని సున్నితంగా స్పర్శించాలి. అలా నెమ్మదిగా వారిని సెక్స్‌కి…
సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే మిగతా ఆరోగ్యం మీద కూడా కాస్త దృష్టి పెట్టండి. ముఖ్యంగా పురుషులు మరింత జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. ఎందుకంటే సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరికి వూబకాయం, మధుమేహం వంటి జీవక్రియల జబ్బుల ముప్పూ పెరుగుతున్నట్టు స్వీడన్ అధ్యయనం పేర్కొంటోంది. వీర్యకణాల సంఖ్య తక్కువగా గలవారిలో సెక్స్ హార్మోన్లు, ఇతర జీవరసాయనాల స్థాయులను పరిశీలించగా.. చాలామందిలో సెక్స్ హార్మోన్లు తక్కువగా ఉండటంతో పాటు జీవక్రియ జబ్బులు, ఎముక క్షీణత లక్షణాలూ బయటపడటం గమనార్హం. సెక్స్ హార్మోన్ల స్థాయులు తక్కువగా గలవారి రక్తంలో హెచ్‌బీఏ1సీ మోతాదులు కూడా ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు బలమైన సూచిక. అంటే వీరికి మున్ముందు మధుమేహం ముప్పూ పెరుగుతుందన్నమాట. అందువల్ల సంతాన సమస్యలు ఎదుర్కొనే పురుషులందరికీ సెక్స్ హార్మోన్ల స్థాయులను పరిశీలించటం అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే తీవ్రమైన సమస్యల ముప్పు గలవారిని సంతాన చికిత్సల…
స్త్రీలలో మూత్రవాహికల్లో వ్యాధి కలగడానికి వారి జననేంద్రియాల నిర్మాణమే కారణం. ఎక్కువమంది స్త్రీలలో వ్యాధిక్రిములు కిందినుంచి పైకి చేరుతాయి. దీనికి మూత్రనాళం (యరెథ్రా) యోనిద్వారంపైనే వుండటం, మూత్రనాళం చిన్నదిగా వుండటమే కారణం. అందుకని యోని దగ్గర చేరిన క్రిములు అతి తేలికగా, అతి త్వరగా మూత్రనాళం నుంచి మూత్రవాహికలకి, ఆపైకీ ప్రయాణించగలుగుతాయి. స్త్రీలలో మూత్రసంబంధిత వ్యాధులే ఎక్కువ!పెళ్ళి అయిన స్త్రీలలో మూత్రవాహికలకి సంబంధించిన ఇన్ఫెక్షన్ కలగడం ఎక్కువ. ఇటువంటి స్త్రీలకే సెక్స్‌లో పాల్గొన్నప్పుడు తరచు ఇన్ఫెక్షన్ వచ్చి మూత్రం మంట అనిపించం, తరచు మూత్రం రావడం వుంటుంది. సెక్స్‌లో పాల్గొనడం మానేస్తే ఏ బాధా లేనట్లు అనిపిస్తుంది. యోని దగ్గర, యోని మార్గం లోపల ఎప్పుడూ కొద్దో గొప్పో వ్యాధిక్రిములు వుటాంయి. అవి మామూలుగా ఎటుంటి వ్యాధిని కలిగించకుండ వుటాంయి. అవి మూత్రనాళంలోకి, మూత్రవాహికల్లోకి చేరినప్పుడే వ్యాధిలక్షణాలని కలుగజేస్తాయి.కొందరు స్త్రీలల్లో మూత్రనాళం సన్నగా వుండి, కాస్త ముడతపివుంటుంది. వారికి మూత్రవాహికలలో క్రిములు…
పిల్లలు పుట్టనివారి విషయంలో సాధారణంగా భర్తకి వీర్యం పరీక్ష, భార్యకి డి అండ్ సి, హిస్టోపథంలాజికల్ ఎగ్జామినేషన్, హిస్ట్రోసాల్పింగో గ్రామ్, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా లోపం ఏదైనదీ తెలుస్తుంది. కొందరికి పై పరీక్షల్లో సరైన లోపం కనబడదు. అటువంటప్పుడు హార్మోన్ టెస్టులు, ఇతర టెస్టులు చేయవలసి వుంటాయి. అండం విడుదలలేని స్త్రీలలో ‘ఫెర్టయిల్’ వంటి బిళ్ళలు ఒక క్రమపద్ధతిలో వాడటం, అవసరం బట్టి హార్మోన్ టెస్టులు, ఇతర టెస్టులు చేయవలసి వుటాంయి. అవసరం బట్టి హార్మోన్ ఇంజక్షన్లు వాడటం జరుగుతుంది. దానివల్ల అండం విడుదలై గర్భం వస్తుంది.పురుషుల విషయంలో కూడ వీర్య కణాలు తగినన్ని లేకపోయినా, జీవం లేకపోయినా ఫెర్టయిల్ విం బిళ్ళలు, హార్మోన్ ఇంజక్షన్లు వాడవలసి వుంటుంది. కొందరు పురుషులకి వేరికోసిల్ వల్ల వీర్యకణాల సంఖ్య దెబ్బతింటుంది. వారికి వేరికోసీల్ ఆపరేషన్ చేసి లోపాన్ని సరిదిద్దాలి.
యోనినే స్త్రీ జననేంద్రియాలుగా లేదా మర్మావయవాలుగా పేర్కొంటారు. స్త్రీ జననేంద్రియాలని రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు.1. బాహ్య జననేంద్రియాలు 2. అంతర్ జననేంద్రియాలు. పెదవులని విప్పకపోతే నోరు లోపల చూడలేనట్లే యోనికి రెండు ప్రక్కలా ఉండే బాహ్యాధరాలని ప్రక్కకు ఒత్తిగించకపోతే యోని రంధ్రంగాని, యోని మార్గం గాని కనబడదు. యోని బాహ్యాధరాలలో రెండు రకాలు. 1.లేబియామెజరా 2. లేబియామైనరా. లేబియా మెజరా క్రింద లేబియామైనరా ఉంటుంది. ఇవి యోని రంధ్రానికి రెండు ప్రక్కలాఉంటాయి. యోనిలో ఏముంటాయి?యోని బాహ్యాధరాలని ప్రక్కకి తొలగించగా యోని లోపల భాగాలు కనబడతాయి. ఈ యోని భాగాలని క్రింద నుంచి పైకి ఈ విధంగా చెప్పుకోవచ్చు. యోని బాహ్యాధరాలని ప్రక్కకి తొలగించినప్పుడు యోని క్రింది భాగంలో యోని రంధ్రం ఉంటుంది. దీనినే యోని ద్వారం అని కూడ అంటారు. దాని పైనే మూత్రం వచ్చే రంధ్రం ఉంటుంది. అది కన్పించీ కన్పించనట్లు ఉంటుంది. మూత్రద్వారం పైన యోని శీర్షం ఉంటుంది. ఇది…
పురుష జననేంద్రియాలని రెండు భాగాలుగా విభజించవచ్చు. 1. బాహ్య జననేంద్రియాలు 2. అంతర్ జననేంద్రియాలు బాహ్యంగా కనబడే జననేంద్రియాలలో 1. పురుషాంగం 2. బీజకోశం. దీనినే బీర్జాలు లేదా వృషణాలు అంటారు.పురుషాంగ నిర్మాణం ప్రత్యేకత కలిగి ఉంది. పురుషాంగంలో ఎటువంటి ఎముక ఉండదు. అలాగే కాళ్ళకి, చేతులకి ఉండే విధంగా గట్టి కండరము ఉండదు. పురుషాంగంలో స్పాంజిలాగ ఉండే టిష్యు మాత్రమే ఉంటుంది. అందువల్ల మామూలు సమయంలో దీనిని ఎటు కావాలంటే అటు తిప్పవచ్చు. ముడవవచ్చు. పురుషాంగంలో మెత్తని టిష్యు పురుషాంగంలో కార్పస్ నోజం , కేర్పస్ ప్పాంజియోజం, అనే టిష్యులు ఉంటాయి. పురుషాంగం నుంచే మూత్రనాళం ప్రయాణిస్తుంది. మూత్రనాళం గుండ వీర్యం కూడ బయటికి వస్తుంది. పురుషాంగం చివరి భాగం గుండ్రంగా ఉంటుంది. దీనినే శిశ్నం అంటారు. ఈ శిశ్నంపైన మూతగా చర్మం ఉంటుంది. దీనిని పురుషాంగ పూర్వచర్మం అంటారు. ఈ చర్మం శిశ్నంపైన అంటుకుని ఉండదు. తేలికగా శిశ్నం…
ప్రశ్న: మాది అన్యోన్య దాంపత్యం. అయినా పెళ్లికి ముందు ప్రేమించిన వ్యక్తితో లైంగిక క్రీడలో పాల్గొంటున్నట్టు కలలు కంటూ ఉంటాను. నేను మంచి భార్యను కానా? జవాబు: అలా ఎందుకనుకుంటున్నారు? మానవ ప్రవర్తనలో ఇది అత్యంత సహజం. అతన్ని పెళ్లి చేసుకోలేక పోయారు కాబట్టి అతనైతే ఎలా ఉండి ఉండేది? అని అనుకోవటం, రాత్రివేళ అందుకు సంబంధించిన ఆలోచనలు రావటం, ఊహలు కలగటం సాధారణమే! అయితే అతని గురించి పగలు కలలు కనకుండా, అది వ్యసనంగా మారకుండా ఉండనంతవరకూ ఎటువంటి ప్రమాదం లేదు. అలాగే ఆ ఆలోచనల వల్ల భర్త మీద అయిష్టత ఏర్పడకుండా ఉండాలి. అలాంటి ఆలోచనలే భర్త మీదకు మళ్లేలా ఆయనతో సఖ్యతగా మెలిగే ప్రయత్నం చేయండి. మీ ఇష్టాన్ని భర్త మీదకు, ఆయనతో ఏర్పడుతున్న అనుబంధం మీదకు మళ్లించండి. మీవారికి తరచుగా కాల్ చేస్తూ సరదాగా, సెక్సీగా మాట్లాడుతూ ఉండండి. ఇలాంటి చిన్న చిన్న అంశాలే దాంపత్యం…
ప్రశ్న: నాకు పెళ్లై ఆరు నెలలైంది. ఈమద్య కాలంలో లైంగికంగా ఎప్పుడు కలిసే ప్రయత్నం చేసినా యోని పొడిగా మారి ఇబ్బంది పెడుతోంది. తేమ లోపించటం మూలంగా కలయిక కష్టమౌతోంది. ఇందుకు కారణమేంటో అర్థం కావటం లేదు?జవాబు: కలయిక సులువుగా జరగాలంటే యోని లోపలి బర్తొలిన్ గ్రంథులు సహజ స్రావాలను స్రవించాలి. అప్పుడే యోని జారుడుగా తాయారవుతుంది. ఫోర్ ప్లే తగ్గినా, సెక్స్ మీద, భాగస్వామి మీద ఆసక్తి సన్నగిల్లినా ఈ స్రావాలు స్రవించక యోని పొడిగా తయారవుతుంది. గతంలో ఏదైనా ఇన్ఫెక్షన్కు గురైనా యోని డ్రైగా తయారవుతుంది. ఇన్ఫెక్షన్ కారణం కాకపోతే వాటర్ బేస్డ్ లూబ్రికెంట్ జెల్లీ వాడి చూడండి. దీన్ని కలయిక ముందు తగినంత పరిమాణంలో యోని లోపలి గోడలకు అప్లై చేస్తే కలయిక నొప్పి లేకుండా జరిగిపోతుంది. ఈ జెల్లీ అన్ని మెడికల్ షాపుల్లో దొరుకుతుంది.
నా వయసు 23 ఏళ్లు. నా అంగం అవసరానికంటే పొట్టిగా ఉందేమోననే అనుమానం నన్ను చాలా కాలంగా వేధిస్తోంది. అంగం ఎంత పొడవుండాలి? పొడవుని పెంచే సర్జరీలేమైనా ఉన్నాయా? సాధారణంగా చాలా మందికి అంగ పరిమాణం గురించి ఎన్నో అపోహలుంటాయి. పొడవు పెంచే వార్తలు, ప్రకటనలను టి.వీల్లో, పేపర్లలో చూసి వాటికి ఆకర్షితులవుతూ ఉంటారు. కానీ అలా చేస్తామని చెప్పే పరికరాలు, నూనెలు నకిలీవి. అవి ఏ రకంగానూ అంగ పరిమాణాన్ని పెంచలేవు. ఎవరికైనా అంగం స్తంభించినప్పుడు, దాని పొడవు కనీసం 3 అంగుళాలు ఉంటే, అంగ పరిమాణంలో ఎటువంటి లోపం లేదని అర్థం చేసుకోవాలి. అంతకుముందువరకూ మామూలుగా ఉన్న అంగం హఠాత్తుగా పొడవు తగ్గితే, అందుకు కారణం హార్మోన్ల లోపం కావచ్చు. అలాంటప్పుడు వైద్యులను కలిసి చికిత్స తీసుకోవచ్చు. పెళ్లైన తర్వాత అంగ పరిమాణం గురించి దంపతుల మధ్య గొడవలు జరిగినప్పుడే వైద్యులు అంగ పరిమాణాన్ని పెంచే సర్జరీ చేస్తారు.…
