Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » స్త్రీ జననేంద్రియాల నిర్మాణం
for female

స్త్రీ జననేంద్రియాల నిర్మాణం

apanalysisBy apanalysisSeptember 5, 2018Updated:May 4, 2026No Comments6 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
యోనినే స్త్రీ జననేంద్రియాలుగా లేదా మర్మావయవాలుగా పేర్కొంటారు. స్త్రీ జననేంద్రియాలని రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు.
1. బాహ్య జననేంద్రియాలు   2. అంతర్ జననేంద్రియాలు.
 పెదవులని విప్పకపోతే నోరు లోపల చూడలేనట్లే యోనికి రెండు ప్రక్కలా ఉండే బాహ్యాధరాలని ప్రక్కకు ఒత్తిగించకపోతే యోని రంధ్రంగాని, యోని మార్గం గాని కనబడదు. యోని బాహ్యాధరాలలో రెండు రకాలు. 1.లేబియామెజరా 2. లేబియామైనరా. లేబియా మెజరా క్రింద లేబియామైనరా ఉంటుంది. ఇవి యోని రంధ్రానికి రెండు ప్రక్కలాఉంటాయి.

యోనిలో ఏముంటాయి?
యోని బాహ్యాధరాలని ప్రక్కకి తొలగించగా యోని లోపల భాగాలు కనబడతాయి. ఈ యోని భాగాలని క్రింద నుంచి పైకి ఈ విధంగా చెప్పుకోవచ్చు. యోని బాహ్యాధరాలని ప్రక్కకి తొలగించినప్పుడు యోని క్రింది భాగంలో యోని రంధ్రం ఉంటుంది. దీనినే యోని ద్వారం అని కూడ అంటారు. దాని పైనే మూత్రం వచ్చే రంధ్రం ఉంటుంది. అది కన్పించీ కన్పించనట్లు ఉంటుంది. మూత్రద్వారం పైన యోని శీర్షం ఉంటుంది. ఇది వేరుశెనగ గింజంత పరిమాణంలో బుడిపలాగ వేలుకి తగులుతుంది. దీనినే క్టైటోరిస్ అంటారు.

ఇక యోని రంధ్రం విషయం తీసుకుంటే ద్వారానికి తోరణం లాగ యోని రంధ్రం దగ్గర కన్నెపొర ఉంటుంది. గిన్నెకి అంచు బయట వైపుకి ఉంటే యోనికి అంచుగా కన్నెపొర యోని రంధ్రం లోపలివైపుకి ఉంటుంది. కొందరిలో ఈ కన్నెపొర యోని రంధ్రం చుట్టుతా ఉంటే మరికొందరిలో యోని రంధ్రానికి సగం వరకే అంచుగా ఉంటుంది. అరుదుగా కొందరిలోనే కన్నెపొర యోని రంధ్రాన్ని పూర్తిగా మూసి ఉంచమో లేదా కన్నెపొర జల్లెలాగ యోని రంధ్రానికి కన్నాలు కలిగి ఉండటమో జరుగుతుంది. కన్నెపొర ఎలా ఉన్నా ఉల్లిపొర లాగ పలచగా ఉంటుంది. కొందరిలో అసలు మొది నుంచే కన్నెపొర ఉండదు. ఎందరిలోనో ఈ కన్నెపొర చిన్నతనంలోనో, యుక్తవయస్సు వచ్చిన తరువాతనో, ఆటలు ఆడుతున్న సమయంలోనో యోని దగ్గర దురద అనిపించి గోక్కోవడం వల్లనో చిరిగిపోవడం జరుగుతుంది.

యోని ద్వారం యోని మార్గానికి గేట్వే
యోని ద్వారం నుంచి యోని మార్గం మొదలవుతుంది. యోని మార్గాన్నే వెజైనా అంటారు. సెక్స్లో పాల్గొన్నప్పుడు స్తంభించిన పురుషాంగం ఇందులోకే ప్రవేశిస్తుంది. కాఫీ ఫ్లాస్కులాగ యోని మార్గం మొద్లో సన్నగా ఉండి లోపలికి పోగా వెడల్పుగా ఉంటుంది. అయితే యోని మార్గం గొట్టంలాగ ఓపెన్గా ఉండదు. గాలి పోయిన సైకిల్ ట్యూబులాగ యోని మార్గం గోడలు  ఒకదానికొకి దగ్గరగా ఉంటాయి. పురుషాంగం ప్రవేశం జరిగినప్పుడే యోని మార్గం విచ్చుకుంటుంది. ఆ సమయంలోనే పురుషాంగ పరిమాణం బట్టి యోని రంధ్రం విచ్చుకుంటుంది. యోని మార్గం గోడలకి పల్చని పొర కప్పి ఉంటుంది.ఈ పొర వెనక స్పాంజి టిష్యూ, ఇలాస్టిక్ టిష్యూ ఉంటుంది. వీటితో పాటు అనేక రక్తనాళాలు వాటిమధ్యలో ఉంటాయి. వివిధ కండరాలు యోని మార్గాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. యోని రంధ్రం దగ్గరి రింగులాగ కండరం ఉంటుంది. మామూలుగా యోని రంధ్రం చూపుడు వ్రేలు దూరేటంత ఉంటుంది. కాని యోని రంధ్రం గుండ పురుషాంగం ప్రవేశిస్తూ ఉంటే  ఆటోమాటిక్గా యోని రంధ్రం చుట్టూ ఉన్న రింగులాంటి కండరం విచ్చుకుంటుంది.

యోని కండరాల మ్యాజిక్!
యోని రంధ్రం మామూలుగా ఒక వ్రేలు దూరేటంత మాత్రమే ఉన్నట్లు అనిపించినా స్తంభించిన పురుషాంగం సునాయసంగా దానిని వెల్పు చేసుకుంటూ యోని మార్గంలోకి ప్రవేశిస్తుంది. అలాగే యోని  రంధ్రం దగ్గర ఉండే ఈ రింగులాంటి కండరం బిడ్డ కాన్పు అయ్యే సమయంలో బిడ్డ బయటకి రావడనికి బిడ్డ పట్టేటంత పూర్తిగా విచ్చుకుంటుంది. యోని మార్గం కూడ అదే విధంగా ఎంతట పరిమాణానికైనా విచ్చుకోవడం ఉంటుంది. మామూలుగా యోని రంధ్రం దగ్గర ఉండే కండరాలు, యోని మార్గంలోని కండరాలు ఒక సన్నటి పెన్సిల్నైనా జారిపోకుండ బిగపట్టి ఉంచుతాయి. అవే  కండరాలు ఎంతటి పరిమాణానికైనా విచ్చుకోవడం దానిని బిగపట్టి ఉంచడం చేస్తాయి. అదే యోనిమార్గంలోని కండరాల గొప్పదనం.యోని కండరాల పరిమాణం బట్టి విచ్చుకోవడం అందులో ప్రవేశపెట్టిన దాన్ని బిగపట్టి ఉంచడం అనే ప్రత్యేకత కలిగి ఉండటం వల్ల పురుషాంగం పెద్దదిగా ఉంటే యోని లోపలికి ప్రవేశించం కుదరదని ఎవరైనా అనుకుంటే అది పొరబాటే అవుతుంది. యోని ద్వారం, యోని మార్గానికి సంబంధించిన కండరాలు చక్కని టెంపర్ కలిగి ఉంటాయి. ఇవి అవసరమైనప్పుడు రబ్బరు లాగసాగుతాయి. మామూలు సమయంలో మూసుకుని ఉంటాయి.

యోని మార్గం మూడున్నర అంగుళాలు  పురుషాంగం ఆరు అంగుళాలు
యోని మార్గం (వెజైనా) మామూలుగా మూడున్నర అంగుళాలు ఉంటుంది. యోని మార్గం లోపలి గోడలు గర్భాశయం దిగువన గర్భాశయ కంఠానికి అంటుకుని ఉంటాయి. యోని మామూలు సమయంలో మూడున్నర అంగుళాల లోతే ఉన్నా పురుషాంగం ప్రవేశించినప్పుడు యోని మార్గంలోని కండరాలు సాగుతాయి. పురుషాంగ పరిమాణం అయిదు అంగుళాలు ఉన్నా ఆరు అంగుళాలు  ఉన్నా అంతకంటే ఎక్కువ ఉన్నా పురుషాంగ పరిమాణం బట్టి యోనిమార్గం వెడల్పు అవటం, పొడవు అవటం జరుగుతుంది. మళ్ళీ రతి ముగియగానే మామూలు సైజుకి వచ్చేస్తుంది.

సెక్స్ లో హాయికి యోనిమార్గంలో మార్పులు
స్త్రీలో కామం కలిగినప్పుడు సెక్స్లో పాల్గొన్నప్పుడు యోని మార్గం లోపల గోడలు ఉబ్బుతాయి. వాటిలోని రక్తనాళాలు బాగా వ్యాకోచిస్తాయి. దానివల్ల యోని లోపల స్పాంజ్బెడ్ తయారవుతుంది. అంతేకాకుండ రతిలో పాల్గొన్నప్పుడు యోని పెదవులు రక్తాధిక్యతతో ఉబ్బి మెత్తగా తయారవుతాయి.

పురుషాంగాన్ని పోలిన స్త్రీ యోని శీర్షం
కామేద్రేకం కలిగినప్పుడు పురుషులలో పురుషాంగ పరిమాణం పెరిగినట్లే స్త్రీలల్లో కూడ కామోద్రేకం కలిగినప్పుడు యోని శీర్షం పొంగుతుంది. మామూలుగా యోని శీర్షం ( క్టైటోరిస్ ) చిన్న పప్పుబద్దలాగ  చేతికి తగలగా కామోద్రేకం కలిగినప్పుడు ఒక పెద్ద బఠానీ గింజంత లేదా వేరుశనగ గింజంత అవుతుంది. మామూలుగా యోని శీర్షం యోని పై భాగంలో యోని బాహ్యాధరాలతో మూయబడి ఉంటుంది.కామనాడులు యోని శీర్షంలో ఎక్కువగా ఉంాయి. అలాగే కామనాడులు యోనిద్వారం చుట్టూ అధికంగా ఉంాయి. రతిలో పురుషాంగం ప్రవేశించినప్పుడు ఇవి తీయని అనుభూతిని కలిగిస్తాయి.  ముఖ్యంగా యోనిశీర్షం అధికంగా స్పందిస్తుంది. కామనాడులు యోని ద్వారం శీర్షంలోనే అధికంగా కేంద్రీకరించబడి ఉంటాయి. ఈ కామనాడులు యోనిమార్గం లోపల ఒకటిన్నర అంగుళం మేరకే  ఉంటాయి. అంతకంటే లోపలకి కామనాడులు ఉండవు. ఒకవేళ కొద్దిగా ఉన్నా వాటివల్ల కలిగే స్పందన చాలా తక్కువ. అందుకనే పురుషాంగపరిమాణం పెద్దదిగా ఉన్నా, చిన్నదిగా ఉన్నా ఒకటే విధంగా  తృప్తి కలుగుతుంది. పురుషాంగపరిమాణం పెద్దదిగా ఉన్నంత మాత్రాన స్త్రీకి అధికంగా తృప్తి కలగడం అంటూ ఉండదు. రతిలో తృప్తికి పురుషాంగ పరిమాణం ఎంత ఉన్నదనేది ప్రధానం కాదు.  పురుషాంగం ఎంత చక్కగా స్తంభించిందనేది ముఖ్యం. అంతేకాకుండ స్త్రీకి సుఖప్రాప్తి కలిగేవరకు రతినికొనసాగించడం ముఖ్యం.

నోటిలోతడిలాగానే యోనిలో తడి
నోటి లోపల ఎప్పుడూ లాలాజలం ఊరుతూ నోరు ఎండిపోకుండ తడిగా ఉంచుతుంది. అదే విధంగా యోని మార్గం లోపల ఎప్పుడూ కొంత ద్రవం ఊరుతూ తడిగా ఉంటుంది. ఈ ద్రవం గర్భాశయ కంఠం  నుండి యోనిమార్గం గోడల నుండి తయారవుతుంది. యోని లోపల ఊరే ఈ ద్రవాలు యోని లోపల బయట టిష్యూలు ఎండిపోకుండ కాపాడతాయి. పైగా ఈ ద్రవాలు ఆమ్ల గుణం కలిగి ఉంటాయి.  అందుకనే అంత తేలికగా వ్యాధి క్రిములు యోని లోపల పెరగలేకపోతాయి. సెక్స్ పరంగా ఆలోచనలు కలిగినా, సెక్స్ పరంగా స్పందించినా, సెక్స్లో పాల్గొన్నా యోనిలో ద్రవాలు మామూలు కంటే  ఎక్కువగా స్రవిస్తాయి. యోనిలో ఈ విధంగా సెక్స్ సమయంలో ద్రవాలు అధికంగా స్రవించచం కూడ అవసరమే. దానివల్ల అంగప్రవేశం తేలికగా జరుగుతుంది. పైగా రతిలో పాల్గొన్నప్పుడు యోనిలోపల  ఒరిపి అంతగా లేకుండ అవుతుంది. దానివల్ల రతి సుఖప్రదంగా అనిపిస్తుంది.

 స్త్రీలలో అంతర్ జననేంద్రియాలు
బాహ్య జననేంద్రియాలు స్త్రీకి సెక్స్లో తృప్తినందించగా అంతర్ జననేంద్రియాలు గర్భధారణకీ, సెక్స్ హార్మోన్లకీ ఉపయోగపతాయి. గర్భకోశం (యుటెరస్), అండవాహికలు (ఫెల్లోపియన్ ట్యూబులు),  అండశయాలు (ఓవరీస్) ఈ మూడు స్త్రీ అంతర్ జననేంద్రియాలు.

గర్భాశయ నిర్మాణం
గర్భకోశం మూడు అంగుళాల పొడవు, రెండు అంగుళాల వెడల్పు, ఒక అంగుళం మందం వుంటుంది. గర్భకోశం గోడలు మామూలుగా ముడుచుకుని దగ్గరదగ్గరగా వుంటాయి. పిండం తయారై పెరుగుతున్నప్పుడు గర్భాశయం గోడల్లోని కండరాలు అపరిమితంగా పెరుగుతాయి. దానితో గర్భాశయం చాలా పెద్దదిగా తయారవుతుంది. కాన్పు అయిన తరువాత అలా పెరిగిన టిష్యూ  కుదించుకుపోతుంది. మళ్లీ గర్భాశయం చిన్నదైపోతుంది. గర్భాశయానికి రెండుపక్కలా కొద్ది దూరంలో అండశయాలు (ఓవరీస్) వుంటాయి. అండశయాల్లోనే స్త్రీ బీజకణం ఉత్పత్తి అవుతుంది. దీనినే  ఓవం అంటారు. లేదా ‘అండం’ అంటారు. స్త్రీలో నెలకి ఒకటే అండం విడుదల అవుతుంది. ఒక నెల కుడివైపు అండశయంలో అండం విడుదలైతే రెండవ నెల ఎడమవైపు అండశయంలో అండం విడుదలవుతుంది. అరుదుగా ఒకే నెలలో రెండు అండశయాల నుంచి అండలు విడుదలవడం, ఒకే అండశయం నుంచి ఎక్కువ అండలు విడుదలవడం వుంటుంది. అటువంటప్పుడు కవలలు పుట్టడం జరుగుతుంది.

అండం ప్రయాణం
అండశయం నుంచి విడుదలైన అండం అండవాహిక ద్వారా గర్భాశయానికి చేరుతాయి. అండవాహికలు గర్భాశయానికి ఇటు అటు వుంటాయి. అండవాహికలు ట్యూబులులాంటివి. అండశయం నుంచి  విడుదలైన అండం అందులో చేరి గర్భాశయం వైపుకి పయనిస్తుంది. అండం అలా ప్రయాణించనికి అండవాహికల్లో ప్రత్యేకమైన నిర్మాణం వుంటుంది. రతిలో పాల్గొన్నప్పుడు స్కలింపబడిన వీర్యకణాలు  యోనిమార్గం నుంచి గర్భాశయంలోకి చేరి ఆపైన ఆండవాహికల్లో ప్రవేశిస్తాయి. అలా అండశయాల్లోకి ప్రవేశించిన అనేక వీర్యకణాల్లో ఏదో ఒక వీర్యకణం అండంతో సమైక్యం అవుతుంది.

 పిండం ఎదుగుదల
అలా సమైక్యం పొందం అండవాహికల్లోనే జరుగుతుంది. సమైక్యమైన సంయుక్త బీజకణం నిదానంగా ప్రయాణించి గర్భాశయానికి చేరి పిండంగా ఎదుగుతుంది. అరుదుగా సంయుక్త బీజకణం  గర్భాశయానికి చేరకుండ అండవాహికల్లోనే వుండి అక్కడ పెరిగి ట్యూటు పగిలిపోవడం, ప్రమాదానికి గురికావడం జరుగుతుంది. స్త్రీలో నెలనెలా బహిష్టులు రావలన్నా, గర్భం నిలబడలన్నా హార్మోన్లు   కావాలి. ఈ హార్మోన్లు అండశయాల నుంచి ఉత్పత్తి అవుతాయి. స్త్రీలలో కామోద్రేకం పెల్లుబికినప్పుడు అంతర్ జననేంద్రియాల్లో కూడ మార్పు వస్తుంది. స్త్రీ కామపరంగా స్పందించినప్పుడు గర్భాశయం రక్తాధిక్యతతో ఉబ్బుతుంది. మామూలు సైజుకంటే పెరుగుతుంది. ఈ పెరుగుదల యాభై నుంచి వంద శాతం వుంటుంది. గర్భాశయాన్ని అంటి పెట్టుకుని చిన్నవీ పెద్దవీ లిగమెంట్లు వుంటాయి. ఈ  లిగమెంట్లు కూడ ఉబ్బుతాయి. ఈ రకంగా గర్భాశయంలో, లిగమెంట్లలో మార్పు వచ్చినప్పుడు గర్భాశయం మామూలు పొజిషన్ నుంచి పైకి లేస్తుంది.

సుఖప్రాప్తిలో కుదుపు ఇచ్చే గర్భాశయం
సెక్స్పరంగా స్పందించినపుడు గర్భాశయం గోడల్లో తెరలు తెరలుగా కంట్రాక్షన్స్ కలుగుతాయి. కొందరికి ఈ కంట్రాక్షన్స్  పొత్తికడుపు దగ్గర మెలినొప్పిగా తెలుస్తుంది. లేదా పొత్తి కడుపు బిగదీసినట్లు  అనిపిస్తుంది. ఆ బిగపట్టం, మెలిపెట్టం, సుఖప్రాప్తితో (ఆర్గజంతో) హాయిని కలిగిస్తాయి. అలసటలో ఆనందంలాగా బిగదీయడం అనిర్వచనీయమైన అనుభూతిని మిగులుస్తుంది. సెక్స్ పరంగా ఉద్రిక్త చెందినప్పుడు బాహ్య జననేంద్రియాల దగ్గర, అంతర్ జననేంద్రి యాల్లోనూ బరువు అనిపించడానికి రక్తాధిక్యత కలగడం కారణం. సుఖప్రాప్తి కలిగిన తరువాత కూడ స్త్రీలకి పది-ఇరవై నిమిషాలుపాటు రక్తాధిక్యత మిగిలి వుండి వెచ్చగా సుఖానుభూతిని కలిగిస్తుంది. కొందరిలో మృదువుగా కంట్రాక్షన్స్  కలుగుతూ సుఖానుభూతులు వుంటాయి. సుఖానుభూతులకి యోనిద్వారం దగ్గర, క్టైటోరిస్ లోని కామనాడులు ప్రధానమైనా అంతర్ జననేంద్రియాల్లోని రక్తాధిక్యత తోడై అనుభూతులని మధురంగా మిగుల్చుతుంది. హిస్ర్టక్టమి  చేయించుకున్నవారికి గర్భాశయం వుండదు కనుక వారిలో సెక్స్ తృప్తి తగ్గుతుందనే అపోహ వుంది. కానీ సెక్స్లో పాల్గొన్నప్పుడు తక్కిన పెల్విక్ కంజెషన్, యోని శీర్షం ఇతర స్పందనలు  మామూలుగానే వుంటాయి కనుక సెక్స్ తృప్తిలో తేడా వుండదు…

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

కామోద్రేకం కలిగినప్పడు స్త్రీల శరీరంలో కలిగి మార్పులు

December 2, 2025

ఏమీ తెలియని అమ్మాయిల.. సందేహాలకు సమాధానలు…

May 19, 2022

అంగస్తంభనలో పురుషాంగ పాత్ర

April 2, 2020

ఇతరులతో చెప్పుకోలేని స్త్రీలలో కలిగే ఆరోగ్య సమస్యలు

April 2, 2020

రతిలో సుఖప్రాప్తి

April 2, 2020

సున్తీ పురుషునిలో సెక్స్ తృప్తిని పెంచుతుందా ? – అనుమానాలు అపోహలు

April 2, 2020
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.