
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర శుక్రవారం ఒక్కసారిగా 993 రూపాయలు పెరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు తర్వాత కేంద్రం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను పెంచడాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ‘ నేను ముందే చెప్పాను. ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం వేడి పుంజుకుంటుందని. ఈరోజు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఒక్కరోజులోనే 993 రూపాయలు పెరిగింది. ఒక్కరోజులో ఇది అతిపెద్ద పెరుగుదల. ఇది ఎన్నికల బిల్లు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు సిలిండర్ ధర రూ. 1,380కి పెరిగింది. కేవలం మూడు నెలల్లో 81 శాతం మేర పెరిగింది’ అని రాహుల్ సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో ఆరోపించారు. గ్యాస్ ధర పెంపెదల వల్ల టీ స్టాల్, ధాబా, హోటల్, బేకరీ, స్వీట్ షాప్ – ఇలా ప్రతి ఒక్కరి వంటగదిపై భారం పడుతుంది. ఇది మీ ప్లేట్ (మీరు తినే ఫుడ్‌పై)పై కూడా ప్రభావం పడుతుంది. మొదట గ్యాస్‌పై దాడి.. ఆ తర్వాత పెట్రోల్- డీజిల్ దాడి అని రాహుల్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
