Author: apanalysis
దేశంలోని మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ 2026 పరీక్ష ఆదివారం మే 3న జరగనుంది. దేశంలోనే అత్యంత క్లిష్టమైన ప్రవేశ పరీక్షగా నీట్‌కు గుర్తింపు ఉంది. అందుకే ఈ పరీక్షను కఠినతరమైన రూల్స్ మధ్య కేంద్రం నిర్వహిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఒకే దశలో పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలలోపే పరీక్షా కేంద్రానికి హాజరు కావాలి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొన్ని రూల్స్ పాటించాల్సిందే. అవి.. పురుష విద్యార్థులు క్యాజువల్ ట్రౌజర్లు, ప్యాంట్లు, జీన్స్ మాత్రమే ధరించాలి. బూట్లు ధరించకూడదు. చెప్పులు మాత్రమే తొడుక్కోవాలి. టోపీలు, మఫ్లర్లు, తలను, ముఖాన్ని చుట్టి ఉంచే ఏ తరహా వస్త్రాన్ని ధరించకూడదు. విద్యార్థినులు లెగ్గింగ్స్, ట్రౌజర్లు మాత్రమే ధరించాలి. అలాగే, సింపుల్‌గా ఉండే చెప్పులు, శాండల్స్ మాత్రమే తొడుక్కోవాలి. షూస్ ధరించకూడదు. చేతికి మెహింది పెట్టుకోకూడదు.…
భారతదేశం దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవు. కానీ దేవాలయ సంస్కృతి, చరిత్ర మరియు వాస్తు వారసత్వంలో ఒక నగరం అన్నింటికంటే ప్రత్యేకంగా నిలుస్తుంది: అదే ఒడిశా రాజధాని భువనేశ్వర్. తరచుగా భారతదేశ దేవాలయాల నగరం అని పిలువబడే భువనేశ్వర్, రెండు వేల సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగిన పురాతన దేవాలయాలు, శిల్పాలు మరియు రాతి గోపురాల అసాధారణమైన సమూహాన్ని కలిగి ఉంది. భువనేశ్వర్‌ను దేవాలయాల నగరం అని ఎందుకు పిలుస్తారు? ఈ నగరంలో ఉన్న గొప్ప హిందూ దేవాలయాల కారణంగా ఈ మారుపేరు వచ్చింది; వాటిలో చాలా దేవాలయాలు 1,000 సంవత్సరాల కంటే పురాతనమైనవి మరియు శాస్త్రీయ కళింగ వాస్తుశిల్పాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ బిరుదు దాని ఆలయాల సంఖ్య మరియు వారసత్వ విలువ రెండింటి నుండి వచ్చింది. ప్రాచీన కాలంలో దాని ఉచ్ఛస్థితిలో, భువనేశ్వర్ చుట్టుపక్కల ప్రాంతంలో వందలాది ఆలయాలు ఉండేవని నమ్ముతారు, ఇది తూర్పు భారతదేశంలోని అత్యంత…
భారతదేశం ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన సాంస్కృతిక మరియు సహజ సంపదలకు నిలయం. ప్రాచీన గుహల నుండి గొప్ప కోటలు మరియు సజీవ దేవాలయాల వరకు, దేశ వైవిధ్యం పెరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ప్రతిఫలిస్తుంది. అయితే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఈ రాష్ట్రం భారతదేశపు వాస్తుశిల్ప వైభవం, మత చరిత్ర మరియు కళాత్మక శ్రేష్ఠతకు ప్రతీకగా నిలిచే, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనేక ప్రదేశాలకు నిలయంగా ఉంది. వీటిలో ప్రాచీన రాతి గుహలు, చారిత్రక రైల్వే వ్యవస్థలు మరియు ఆధునిక వాస్తు వారసత్వం ఉన్నాయి. మహారాష్ట్రలో ఎన్ని యునెస్కో సైట్లు ఉన్నాయి? తాజా యునెస్కో జాబితాల ప్రకారం, మహారాష్ట్రలో ఆరు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి: అజంతా గుహలు (1983) అజంతా గుహలు ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న, క్రీ.పూ. 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 6వ శతాబ్దం నాటి బౌద్ధ రాతి గుహల…
1913వ సంవత్సరం మే 3వ తేదీ, భారతదేశం వినోదాన్ని మరియు ప్రజా సంస్కృతిని చూసే విధానాన్ని శాశ్వతంగా మార్చివేసిన ఒక సంఘటనకు నాంది పలికింది. భారతదేశంలో ఇప్పటివరకు నిర్మించిన మొట్టమొదటి పూర్తి నిడివి చలనచిత్రమైన ‘ రాజా హరిశ్చంద్ర’ , ఆ తర్వాతి శతాబ్దంలో వచ్చిన ఇతర సినిమా నిర్మాణాలకు మార్గం సుగమం చేసింది. ఈ చిత్రాన్ని ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే నిర్మించి, దర్శకత్వం వహించి, సహ-స్క్రీన్‌రైటర్‌గా కూడా వ్యవహరించారు. ఈయనను మనం ఈనాడు గౌరవంగా దాదాసాహెబ్ ఫాల్కే అని పిలుచుకుంటాము. నిజానికి, ఫాల్కే ఈ చిత్రాన్ని నిర్మించడానికి తన వ్యక్తిగత పొదుపును ఖర్చు చేశారు. రాజా హరిశ్చంద్ర అనే ఈ చిత్రం మూకీ సినిమాల కోవకు చెందినది, సుమారు 40 నిమిషాల నిడివి కలిగి, పూర్తిగా భారతీయ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులచే రూపొందించబడింది. అత్యంత ధర్మబద్ధుడు, నిజాయితీపరుడైన ఒక రాజు, ఋషి విశ్వామిత్రునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తన…
గోవాలో జరగనున్న 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) సంచాలకునిగా ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ అశుతోష్ గోవారికర్‌ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నియమించింది. శ్రీ గోవారికర్ భారతీయ సినిమాకు విశిష్టమైన సేవలందించిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత. ఐఎఫ్ఎఫ్ఐతో ఆయనకు దశాబ్దాల అనుబంధం ఉంది. ఇది చలనచిత్ర కళల పరిణామం, అంతర్జాతీయ సినిమా సంస్కృతితో ఆయనకున్న ప్రగాఢ అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నియామకం పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, శ్రీ గోవారికర్ ఇలా అన్నారు… “గోవాలో జరిగే ప్రతిష్టాత్మక 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవానికి ఫెస్టివల్ డైరెక్టర్‌గా సేవ చేయడం నాకు అపారమైన గౌరవాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఉత్సవ పరిణామక్రమాన్ని చూస్తుండడం నా అదృష్టం. 1984లో తొలిసారి ఈ ఉత్సవాలకు హాజరైనప్పటి నుంచి, 2024లో అంతర్జాతీయ సినిమాకు జ్యూరీ అధ్యక్షుడిగా పనిచేసే వరకు దీనితో నా అనుబంధం కొనసాగుతూ వస్తోంది”. “1952 నుంచి దశాబ్దాలుగా ఎంతోమంది ఉత్సవ కమిటీ…
రూ. 1,745 కోట్ల విలువైన అత్యున్నత నాణ్యత కలిగిన 349 కిలోల కొకైన్ స్వాధీనం ఈ అద్భుతమైన విజయంపై ఎన్సీబీ బృందాన్ని అభినందించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మాదకద్రవ్యాల ముఠాలను నిర్దాక్షిణ్యంగా అణిచివేసేందుకు మేం కృతనిశ్చయంతో ఉన్నాం: కేంద్ర హోం మంత్రి చిన్న పరిమాణంలోని మాదకద్రవ్యం ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టి దాని వెనుక ఉన్న భారీ నెట్‌వర్క్‌ను ఛేదించడంలో ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోన్న ఈ ఆపరేషన్: కేంద్ర హోం మంత్రి గత ఆరు నెలలకు పైగా నిరంతరం నిఘా ఉంచి పక్కా సమాచారంతో ఎన్సీబీ చేపట్టిన ఈ ఆపరేషన్ ఒక గొప్ప విజయాన్ని సాధించింది: కేంద్ర హోం మంత్రి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో విజయవంతం అయిన ఆపరేషన్.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రభుత్వానికి ఉన్న ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని తెలియజేస్తోంది: కేంద్ర హోం…
ఆంధ్రప్రదేశ్.. అరుణాచల్ ప్రదేశ్.. హర్యానా.. చండీగఢ్.. మధ్యప్రదేశ్.. ఛత్తీస్‌గఢ్‌లలో జనగణన-2027 కింద గృహ వివరాల సేకరణ ప్రారంభం ఢిల్లీ.. రాజస్థాన్.. మహారాష్ట్ర.. మేఘాలయ.. జార్ఖండ్ సహా ‘ఎంసీడీ’ ప్రాంతాల్లో స్వీయ నమోదుకు శ్రీకారం · జనగణనలో తొలిసారి ప్రవేశపెట్టిన స్వీయ నమోదు సౌలభ్యానికి ప్రజాస్పందన ప్రోత్సాహకరం · ఇప్పటిదాకా దాదాపు 82 లక్షల కుటుంబాల స్వీయ నమోదు · జనగణన చట్టం-1948 కింద సేకరించే ఈ సమాచారం అత్యంత గోప్యం… గణాంక ప్రయోజనాలు.. ప్రగతి ప్రణాళికల కోసం మాత్రమే వినియోగం · గృహాల జాబితా సేకరణలో అధికారులకు పూర్తిగా సహకరించాలని… ఈ కీలక జాతీయ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ప్రకటిత రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలను కోరిన ప్రభుత్వం దేశంలో తాజా జనగణన కింద ప్రకటించిన 15 రోజుల స్వీయ నమోదు గడువు ముగిసిన నేపథ్యంలో జనగణన-2027 తొలి దశలో భాగంగా ఇళ్ల జాబితా, గృహ గణన (హెచ్ఎల్ఓ) కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.…
స్ట్రాంగ్ రూముల్లోని బ్యాలెట్ బాక్సుల భద్రతపై దీదీ సంచలన కామెంట్లు బ్యాలెట్ బాక్సులను తారుమారు చేయాలని చూస్తున్నారంటూ ఆగ్రహం అన్యాయాన్ని అడ్డుకునేందుకు ప్రాణాలైనా అర్పిస్తానని స్పష్టం బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కంటి మీద కనుకు లేకుండా పోయింది. అర్ధరాత్రి వేళ కోల్‌కతాలోని ఒక ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ను ఆకస్మికంగా సందర్శిస్తున్నారు. ఈవీఎంలను మారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. యంత్రాంగం అంతా మమతా బెనర్జీ చేతుల్లోనే ఉంటుంది. ఈసీ కేవలం ఎన్నికల నిర్వహణ బాధ్యతలు మాత్రమే చేపడుతుంది. అయినా ఈవీఎంలు మారుస్తున్నారని మమతా బెనర్డీ ఆరోపిస్తూ రాజకీయం చేస్తున్నారు. అర్థరాత్రి పూట తాను పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గంలోని సఖావత్ మెమోరియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అర్ధరాత్రి ఆకస్మికంగా సందర్శించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆమె అక్కడే ఉండి ఈవీఎంల భద్రతను పర్యవేక్షించారు. విపక్షాలు ఈవీఎంలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, డేటా మార్చే అవకాశం…
‘మత్తు వదలరా’, ‘మత్తు వదలరా 2’ విజయాలు సాధించడంలో కమెడియన్ సత్యది కీలక పాత్ర. ఆ సినిమాల దర్శకుడు రితేష్ రాణాతో సత్య చేసిన తాజా సినిమా ‘జెట్లీ’. ఇందులో ఆయన హీరో. ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్ర చేశారు. రియా సింఘా హీరోయిన్. మే 1న థియేటర్లలో విడుదలైందీ సినిమా. ‘మత్తు వదలరా’ తరహాలో నవ్వించారా? ఈ సినిమా ఎలా ఉంది? అంటే… కథ : ప్రజాపతి (అజయ్) బ్యాంక్ బోర్డ్ తిప్పేసి విదేశాలకు పారిపోతాడు. ఇదే సమయంలో తనపై ఒక హత్యాయత్నం జరుగుతుంది. ఏజెంట్ రియా సింఘా, ప్రజాపతిని పట్టుకుని స్వింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో దుబాయ్ నుంచి ఇండియాకి తీసుకొస్తుంది. ఈ ఫ్లైట్ జర్నీలో ప్రజాపతిని చంపాలని ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. మరో గ్యాంగ్ తనని తప్పించాలని చూస్తుంది. ఇదే ఫ్లైట్‌లో వేదవ్యాస్ (సత్య) జర్నీ చేస్తుంటాడు. తనకు ఒక వింత సమస్య.. తను సడన్ గా…
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర శుక్రవారం ఒక్కసారిగా 993 రూపాయలు పెరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు తర్వాత కేంద్రం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను పెంచడాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ‘ నేను ముందే చెప్పాను. ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం వేడి పుంజుకుంటుందని. ఈరోజు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఒక్కరోజులోనే 993 రూపాయలు పెరిగింది. ఒక్కరోజులో ఇది అతిపెద్ద పెరుగుదల. ఇది ఎన్నికల బిల్లు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు సిలిండర్ ధర రూ. 1,380కి పెరిగింది. కేవలం మూడు నెలల్లో 81 శాతం మేర పెరిగింది’ అని రాహుల్ సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో ఆరోపించారు. గ్యాస్ ధర పెంపెదల వల్ల టీ స్టాల్, ధాబా, హోటల్, బేకరీ, స్వీట్ షాప్ – ఇలా ప్రతి ఒక్కరి వంటగదిపై భారం పడుతుంది. ఇది మీ ప్లేట్ (మీరు తినే ఫుడ్‌పై)పై కూడా ప్రభావం…
