Author: apanalysis
కారణాలు ఏవైనా చాలామంది మహిళలు ఉదయం పూట అల్పాహారం తినరు. టిఫిన్ తినాలనే ధ్యాసే వారికి ఉండదు. నిద్ర లేచిన వెంటనే ఓ కప్పు కాఫీనో, టీనో తాగి, దానితో సరిపెట్టుకుంటారు. ఇంటి పనులన్నీ ఆ కాస్త టీతో, కాఫీతో చేస్తారు. ఇంట్లో ఉన్న వారందరికీ ఆహారాన్ని, టిఫిన్లను తయారు చేస్తారు కానీ, దాన్ని వండే స్త్రీలు తినడంలో తీరిక ఉండదు. ఇలా ఏమీ తినకుండా మధ్యాహ్నం దాకా గడుపుతుంటారు. ఇలాంటివారు పొద్దుట పూట ఏదో ఒకటి కడుపులో పడేసుకోవాలని అనుకోకుండా నేరుగా ఒంటిగంటకో, రెండుగంటలకో ఏకంగా భోజనాన్నే చేస్తారు. కాఫీ, టీలతో కడుపునింపుకుంటూ పొద్దుట అల్పా హారం చేయనివారిలో మూడొంతుల మంది మహిళలు ఇలానే ఉంటారు. ఈ కోవకు చెందిన వారు తొందరగా ఆనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.. కాబట్టి మహిళలు మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఉదయంపూట మీరెంత బిజీగా ఉన్నా కాస్త…
Stress శరీరాన్నీ, మనసునీ సడలించేందుకు మార్గాలు కొన్ని ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా పాటిస్తే సత్ఫలితం ఉంటుంది.ఒత్తిడిని తగ్గించుకునేందుకు చేయవలసిన కొన్ని పనులుఏదో నృత్యం చెయ్యటం, ఒకరకమైన వ్యాయామం, పరిగెత్తటం, వంట చెయ్యటం, పెంపుడు జంతువులతో ఆడుకోవటం, స్పాకి వెళ్లటం, సినిమాలు చూడటం సంగీతం వినటం, కారు నడుపుతూ చాలా దూరం వెళ్లటం, ట్రెకింగ్, శుభ్రం చెయ్యటం, తోటపని, పొలం పని, బట్టలు ఉతకటం, చాలాదూరం వ్యాహ్యాళికి వెళ్లటం, చిత్రాలు గీయటం. ఇందులో ఏవో కొన్నింటిని మీరు అలవాటు చేసుకుని క్రమం తప్పకుండా పాటిస్తే ఒత్తిడి మీ దరిదాపుల నుండి పారిపోతుందనడంలో అతిశయోక్తి లేదు
Sary Selectionమన వస్త్రధారణ మనకు నచ్చితేనే కాదు నలుగురిని మెప్పించేదిలా ఉండాలి. శరీరరీత్యా, వయసు రీత్యా ఎవరు ఎలాంటి వస్త్రధారణ చేయవచ్చో చూద్దమా…అధిక బరువున్న అమ్మాయిలు బాడీ ఫ్రేంని అనుసరించి దుస్తులు ధరించాలి. స్లీవ్ లెస్ అసలు వాడవద్దు. డార్క్ కలర్స్, డల్ కలర్స్ అంటే స్కై బ్లూ బదులు డల్ బ్లూ, రాయల్ బ్లూ ధరించండి. చిన్న ప్రింట్ వర్టికల్ లైన్స్ సన్నగా ఉన్నట్లు కనిపిస్తారు. షిఫాన్ జార్జెట్ చీరలు బాగుంటాయి.మీడియం బరువున్న వారు బెజ్, లైట్ పసుపు షేడ్స్, జార్జిట్, శాటిన్ చీరలు బాగుంటాయి.సన్నగా ఉన్నవారు ఏ కలర్ ధరించినా పర్వాలేదు. స్లీవ్ లెస్, స్ట్రాపీ, డీప్ కట్ బ్లౌజులు బాగుంటాయిఫెయిర్ కాంప్లెక్షన్ వారు కాపర్, గోల్డ్ బ్లెండ్వి,గోధుమ వర్ణం వారు వైట్, బెజ్, బ్రాంజీ గోల్డ్,డార్క్ స్కిన్ వాళ్ళకు గోల్డెన్ కాపర్ షేడ్ చక్కగా నప్పుతాయి.శరీర భాగాలు కనిపించాలనుకుంటే లైట్ కలర్స్,తక్కువ ఎత్తులో కనిపించాలంటే డార్క్ కలర్…
Hair Careవెంట్రుకలు పట్టుకుచ్చులా ఉండాలని ఆశపడని అమ్మాయి ఉండదని అంటే అతిశయోక్తి కాదేమో. ముఖానికి అందాన్నిచ్చేది ఒత్తయిన జుట్టే. అలాంటి జుట్టు పట్టులా మెరిసిపోవడానికి కోన్ని చిట్కాలు ఇది పొడిబారిన జుట్టుకు చక్కని పరిష్కారం : రెండు అరటిపండ్లను మెత్తని గుజ్జులా చేసుకోని. దానికి రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత స్నానం చేస్తే.. జుట్టుపట్టులా మెరుస్తుంది.వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్వులనూనె సమపాళ్లలో కలిపి, తలకు రాసుకోవాలి. ఒక కోడిగుడ్డులోని సొనను గిన్నెలో వేసి బాగా చిలకరించి అందులో నిమ్మపండు రసం కలపండి. నాలుగు చెంచాల పెరుగును కూడా ఈ మిశ్రమానికి కలిపి తలకు పట్టించి అరగంట సేపు ఉంచాలి. తరువాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. కొబ్బరినూనెలో వెల్లుల్లిపాయలు ఉడికించి వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్లవెంట్రుకలు నల్లగా మారతాయి.ఉసిరిపొడిని ఇనుపపాత్రలో రాత్రిపూట నానపెట్టి ఉదయాన్నే ఆ మిశ్రమం…
Eye careఅన్ని అవయవాల్లో కళ్లు ప్రధానమైనవి. అలాంటి కళ్ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే చికిత్స తీసుకోవాలి. మీ చూపు పదిలంగా పదికాలాలు ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాల్సిందే. అవేమిటంటే…వంటగదిలో పనిచేసేటప్పుడు లేదా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చేత్తో నలపడం కానీ, రుద్దడం గానీ చేయకూడదు. చేతికున్న మట్టి, ధూళికణాలు, సూక్ష్మక్రియుల కంటిలోకి చేరి అలర్జీ లేదా ఇన్ఫెక్షన్ను కలిగించే ప్రమాదముంది.వంటచేసేటప్పుడు వేడి అవిరి కళ్లకు తగిలినప్పుడు లేదా కూరగాయలు శుభ్రం చేసే సమయంలో ధుమ్ముపడితే వెంటనే చేతులు శుభ్రం చేసుకుని చేతివేళ్లతో నీటిని కళ్లమీద చిలకరించి మెత్తని గుడ్డతో కళ్లు తుడుచుకోవాలి.కళ్లను రోజుకు వీలైనంత వరకు రెండుసార్ల కన్నా ఎక్కువ కడగవద్దు.కంటికి సరిపడా నిద్ర, విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం.కళ్లలో మంట ఏర్పడి ఎరుపెక్కినపుడు ఏదో తమకు తోచిన మందులు, చిట్కాలు వాడకుండా వెంటనే కంటి డాక్టరును సంప్రదించాలి.ఎప్పుడూ కూడా నెంబరులేని కళ్లజోళ్లను…
Jeansతీరైన ఆకృతికి జీన్స్ ప్యాంట్ చక్కని ఎంపికవుతుంది. మరి వీటిని శభ్రపరిచే విషయంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు ఈ నియమాలు పాటించి చూడండి.లేత రంగులో ఉన్న ప్యాంట్‌ని ముందు చల్లటినీళ్లలో నానబెట్టి తర్వాత కాసేపు సర్ఫ్నీళ్లలో నానబెట్టి, గంటయ్యాక ఉతికితే సరిపోతుంది. సాధ్యమైనంత వరకూ జీన్స్ దుస్తులను వేడికి దూరంగా ఉంచాలి.జీన్స్ ప్యాంట్లను ఉతికే నీళ్లలో చెంచా ఉప్పు వేసి, ఆ నీళ్లలో గంట పాటు నానబేటిట ఉతికితే రంగు పోదు. అంతేకాదు మురికి, ఇతర మరకలున్నా త్వరగా వదిలి ప్యాంట్ కొత్తగా కనిపిస్తుంది.ఎంతో ఇష్టపడి కొన్న జీన్స్ రంగు పోతునట్లు అనిపిస్తే, పావు బెకట్ నీళ్లలో కప్పు వెనిగర్ కలిపి. ఈ నీళ్లలో జీన్స్ ప్యాంటును నానబెట్టలి. కాసేపయ్యాక సబ్బుతో ఉతికి, గంజి పెట్టి ఎండలో ఆరేయాలి. గంజి పెట్టడం వల్ల రంగు కోల్పోకుండా ఉంటుంది. ఇస్త్రీ చేయిస్తే ఇంకా మంచిది.ఒకవేళ జీన్స్ దుస్తుల మీద మరకలు పడితే…
వాతావరణం మారగానే ఆ ప్రభావం ఎంతో కొంత మన ఆరోగ్యం మీద పడుతుంది. వర్షాకాలం మరీను. ఈ కాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మనం నిరంతరంగా పనిచేయలేము. ఎప్పుడో ఒకసారి సరదాగా వానలో తడిస్తే ఆ ఆనందం వేరు. అయితే రోజూ నిమిషాలతో పరుగులు తీసేవారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వర్షాకాలం కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. వానొస్తే పనికొచ్చే కొన్ని సూచనలు ఇవిసిల్కు, షిఫాన్ దుస్తులు వాడాలి. ఇవి వాడటం వల్ల బట్టలు ఉతికే శ్రమ, ఆరబెట్టే సమయం ఆదా అవుతాయి.పాదాలు ఎక్కువసేపు నీళ్లలో నానితే కాలివేళ్లు ఒరిసిపోతాయి. వర్షాకాలం ఎక్కువగా వేధించే సమస్య ఇదేనని చెప్పాలి. తప్పనిసరై నీళ్లలో వెళ్లవలసి వచ్చినపుడు పాదాలకు కాస్త గ్లిజరిన్ రాసుకుని వెళ్లటం మంచిది.రాత్రి నిద్రపోయే ముందు వేపనూనెను కాలివేళ్ల మధ్య రాస్తుంటే ఒరుపులు చాలా త్వరగా తగ్గుతాయి.తల తడిస్తే వెంటనే ఆరబెట్టుకోవాలి. లేకపోతే జలుబు చేయడమే కాదు, జుట్టు కూడా రాలుతుంది.కొబ్బరినూనెని వెచ్చబెట్టి జుట్టు…
వర్షాకాలం నీటి తుంపరులు, శీతాకాలపు చల్లనిగాలులు శరీరంలో మధురానుభూతిని కలిగించడంతో పాటు ఎన్నో వ్యాధులను కలుగచేస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం, కీళ్లనొప్పులు, శ్వాస సంబంధిత సమస్యలు ఈ కాలపు ఆనందాన్ని పాడు చేస్తాయి. ఈ వ్యాధులు పిల్లలలో, వృద్ధులలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో వస్తాయి. ఇవి వారిమీద క్రమంగా పట్టుసాధిస్తాయి. ప్రారంభంలోనే ఈ విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే తేలికపాటి జలుబు నుంచి తీవ్రమైన నిమోనియా, టైఫాయిడ్ లాంటి వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో పిల్లలు,వృద్ధుల విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. వారి దుస్తులు, ఆహారపానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బిజీగా ఉంటే జీవనశైలి స్త్రీ, పురుషులలో పని సామర్థ్యాన్ని పెంచేసింది. ఆ క్రమంలో మానసిక వత్తిడి, శారీరక, శ్రమ వారిని ఆవరించేస్తున్నాయి. ఆధునిక జీవనశైలి జీవిత విధానాన్ని మార్చేసింది. ఇది ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు ఏర్పడటం, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడడం, క్రమంగా శరీర అంతర్గత శక్తిని బలహీనపరిచే శ్వాససంబంధ…
ప్రతి ఒక్కరూ ప్రతిచోటా ఆనందాన్ని కోరుతున్నారన్నది నిజం. కాని దానిని వెతుక్కోవడం, దొరికిన ఆనందాన్ని పదిలపరుచుకోవడం అన్నది చాలా కష్టంతో కూడిన పని. ఆనందం అన్నది సంపదనూ, పేరుప్రతిష్టలనూ పుష్కలంగా ఆర్జించి పెట్టగల చోటే దొరుకుతుందనుకోవడం వల్లే ఈ కష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇతరులను సంతోషపెట్టగలిగినప్పుడే మనం సంతోషంగా ఉండగలం. మీరు పంచి పెట్టిన ఆనందం మిమ్మల్ని కాంతివంతం చేస్తూ మీ వద్దకు తిరిగి వస్తుంది.ఆసక్తికరమైన వ్యక్తిగా ఉండాలి. అన్నింటిలో ఆసక్తిని కనబరుస్తూ ఉంటే మన జీవితం నుండి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని పొందగలం. ఇతరులపట్ల, స్వార్థ భావన లేకుండా ఉండగలగాలి. అన్ని వేళలలో ఇతర ధ్యాస లేకుండా మనల్ని గురించే ఆలోచిస్తూ, దిగులుపడుతూ ఉండడం కంటే ఇతరుల గురించి ఆలోచిస్తూ, మన చుట్టూ ఏమి జరుగుతుందో దానిని గమనించే వారిగా ఉండడం మంచిది. మనం చేసే పనులను ఇతరుల కంటే వేరు విధంగా ఉండేలా, ఉత్తమమైన రీతిలో చేయాలి.ఇష్టపడే పనిని…
Fruitsపండ్లు తింటే మంచి ఫలితమే ఉంటుంది. ఆరోగ్యాన్ని పెంచడంలో, అనారోగ్యాన్ని అడ్డుకోవడంలో తాజా పండ్లది ప్రత్యేక పాత్ర. ఒక్కో పండు ఒక్కో లాభాన్ని చేకూర్చుతాయి. అందరికీ అందుబాటులో ఉండే కొన్ని పండ్లు- వాటి ప్రయోజనాలు తెలుసుకుందాం. మనలో ఆరోగ్యాన్ని, రోగనిరోధకశక్తి పెంచే ఆ పండ్లు తినటం అన్ని విధాల మంచిదే!బొప్పాయి: మనం తీసుకునే ఆహార పదార్థాలను జీర్ణం చేసి శరీరానికి శక్తినందించే జీర్ణవ్యవస్థను సరిగా పనిచేయించే ఎంజైములు బొప్పాయిలో ఎక్కువగా ఉంటాయి. ఈ పండులో ఉండే పెపైన్ అనే పదార్థం మాంసకృత్తులను సులువుగా కరిగేలా చేస్తుంది.యాపిల్: ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నిచ్చే ఈ పండ్లలో త్వరగా జీర్ణమయ్యే పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఫైటో కెమికల్స్‌ను రక్షించే రోగ నిరోధక వ్యవస్థ మెండుగా వుంటుంది.అనాస: మాంసకృత్తులను సులువుగా జీర్ణం చేసే బ్రొమెలిన్ ఎంజైమ్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాలు, కణజాలం వాపులు, నొప్పులపై అద్భుతంగా పనిచేస్తుంది. వ్యాయామం చేయడానికి ముందు కొన్ని అనాస…
