Author: apanalysis

మీరు చాల లావుగా ఉన్నారా ? అయితే అలా చేయండి.. మీరు చాల సన్నగా ఉన్నారా ? అయితే ఇలా చేయండి. ఇలాంటి ప్రకటనలు మనం రోజూ టీవీలోను మరియు పేపర్లోను చూస్తూనే ఉంటాం. కొంతమంది కేవలం చూడడమే కాదు.. వాటిని ఫాలో అవుతుంటరు కూడా. కానీ కొందరికి అవి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. కొవ్వు ఎక్కువగా ఉండడం వల్లనే లావుగా ఉంటరనేది చాలామంది అభిప్రాయం. కానీ సన్నగా ఉన్న వారి శరీరంలో కూడా కొవ్వు పేరుకుని ఉంటుంది. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో తెలియక కొందరు డైటింగ్ అని కడుపు మాడ్చుకుంటే.. మరికొందరు ఏవో సర్జరీలు చేయించుకుంటారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి అంత మంచివి కావు. మరి కొవ్వు సమస్య నుంచి ఎల బయటపడాలో అర్థం కావట్లేదా ? చాల సింపుల్.. కొవ్వు కరిగించే పదార్థాలు ఏమిటో తెలుసుకుని వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుంది..…

Read More

ఎప్పుడు చలాకీగా, పని విషయం చాల చురుగ్గా ఉండే మహిళలు నెల నెలసరి సమయంలో మాత్రం కూర్చొన చోటు నుంచి లేవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కారణం అధిక రక్తస్రావం సమస్య. నిజానికి చాల మంది ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందైతే సమస్య తీవ్రంగా ఉంటే పనులేవి చేసుకోకుండా రెస్ట్ తీసుకుంటుంటారు. అయితే ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు. ప్రతి నెల ఇదే సమస్యతే మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు నిపుణులు. నెలసరి దగ్గర పడుతూంటే చాలు. అధిక రక్తస్రావం సమస్య ఉన్న మహిళల్లో కంగారు మొదలవుతుంది. అసలు రక్తస్రావం అధికంగా అవుతోందా? లేదా? అని తెలుసుకోవాలంటే ముందు సాధారణంగా ఎంత రక్తస్రావం అవ్వచ్చనే దానిపై అవగాహన ఉండాలి. సాధారణ నెలసరి అంటే నెలకు మూడు నుంచి ఐదు రోజుల కంటే ఎక్కువగా రక్తస్రావం కాకూడదు. ఈ సమయంలోనూ ఇరవై నుంచి అరవై మి.లీ. దాకా మాత్రమే…

Read More

ఆడవాళ్లకు మెదళ్ల పరిమాత్రమే చిన్నదనీ, అయితే, సామర్థ్యంలో మాత్రం ఎవరికీ తీసిపోవని వివిధ దేశాలలో మెదడు పనితీరుపై జరుగుతున్న పరిశోధనల ద్వారా తెలుస్తోంది. మహిళల్లో మెదడు సైజు చాలా చిన్నగా ఉన్నప్పటికీ, పురుషుల మెదడు కంటే వేగంగా, చైతన్యవంతంగా పనిచేయగల సామర్థ్యం దానికి ఉందని పరిశోధనల్లో వెల్లడైంది. పురుషుల మెదళ్లతో పోలిస్తే ఆడవాళ్లకు మెదళ్లు చాలా చిన్నవే అయినా అవి పాదరసంలా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా మహిళలకు పురుషుల కంటే మెదడు ఎనిమిది శాతం తక్కువగా ఉంటుంది. అయితే, తమ చుట్టూ చోటు చేసుకుంటున్న మార్పుల్ని పసి కట్టడంలోనూ, విచక్షణ చేయడంలోనూ అది పురుషుల కంటే అనేక రెట్లు ఎక్కువ చైతన్యవంతంగా పని చేస్తుందని చెబుతున్నారు. తమ మెదళ్లు చిన్నవైనా ఆడవాళ్లు వాటిని మగవారి కంటే చాలా సమర్థవంతంగా, చురుకుగా, వేగంగా ఉపయోగిస్తుంటారు. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు ఎక్కువగా పని చేయడానికి, వేగంగా పని చేయడానికి కారణం వారి మెదళ్ల తీరు తెన్నులు మగవాళ్ల కంటే భిన్నంగా ఉండడమే. పైగా మగవాళ్లు మెదడు…

Read More

కొన్ని కుటుంబాల్లో తమ పిల్లలకు కోపాన్ని వ్యక్తం చేసే ఏ చిన్న అవకాశమూ ఇవ్వరు. ఆ పిల్లలే రేపు యుక్తవయస్కులై, ప్రేమికులై, దంపతులయ్యాక సహజీవనంలో ఎన్నో సమస్యలు ఎదుర్కుంటారు. కోపాన్ని ఒక పరిణతితో, ఎదుటి వారు ఆమోదించేలా వ్యక్తం చేయడం ఎలాగో వాళ్లకు ఎంత మాత్రమూ తెలియదు. చెప్పదలుచుకున్న విషయం హేతుబద్ధమే కావచ్చు. ప్రయోజనకరమే కావచ్చు. కానీ, ఆ వ్యక్తం చేసే విధానంలోని లోపమే బంధాల మధ్య దూరాలు పెరగడానికి కారణమవుతుంది. అంటున్నారు మానసిక తత్వ శాస్త్ర వేత్తలు. ఏ చిన్న వాహనాన్ని నడపడానికైనా శిక్షణ తీసుకుంటాం. కానీ, మనలోని భావోద్వేగాల్ని వ్యక్తం చేయడానికి ఏ శిక్షణా ఉండదు. బాహ్యంగా ఎవరో వచ్చి శిక్షణ ఇవ్వకపోయినా, మనకు మనమే ఆత్మ శిక్షణ ఇచ్చుకోవడం అవసరం. ఆ శిక్షణ ఇచ్చుకోవడం కన్నా ముందు అసలు కోపం అంటే ఏమిటో, కోపం రావడానికి గల అసలు కారణమేమిటో ముందు తెలియాలి. ఊహ తెలిసిన నాటి…

Read More

ఒంటరితనమంటే ఇష్టమా? ఒంటరి జీవితానికి తప్పని పరిస్థితుల్లో అలవాటు పడిపోయారా? ఒంటరిగా ఉండాల్సి వస్తోందా? అయితే జాగ్రత్త. ఎందుకంటే ఒంటరితనం వల్ల అనేకానేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు వైద్య పరిశోధకుల బృందం తేల్చి చెప్పింది. ఒంటరితనమనేది అసౌకర్యంగా, విషాదంగా ఉండడంతో పాటు శరీరంలోని వ్యాధి నిరోధక శక్తికి ఎంతగానో చేటు తెస్తోందని ఈ బృందం ఇటీవల ఓ అధ్యయనం ద్వారా వెల్లడించింది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా క్షీణించిపోవడంతో పాటు, నిర్ధారణ చేయలేని అనేక అనారోగ్యాలు కూడా శరీరంలో ప్రవేశిస్తున్నట్టు వందలాది మందిని పరిశీలించిన తరువాత ఈ బృందం కనుగొంది. ఇల్లూ, ఆఫీసూ తప్ప మరేమీ పట్టక, ఇంటిలోనూ, ఆఫీసులోనూ కూడా తన పనే దో తాను చేసుకుంటూ పోతూ, ఎవరితోనూ కలవకపోవడమే ఓ మానసిక సమస్య కాగా, అది క్రమంగా శరీరంలో సృష్టించే తీవ్రస్థాయి అనారోగ్య సమస్యలు ఒక పట్టాన చికిత్సకు లొంగవని కూడా డాక్టర్లు చెబుతున్నారు. ఒంటరితనంతో…

Read More

ఈ మధ్య ప్రతి ఒక్కరూ కంగారు పడుతున్న సమస్య, ప్రతి ఒక్కరినీ బాధపెడుతూ ఉన్న సమస్య అధిక కొవ్వు. ఈ కొలెస్టరాల్ మన శరీరంలో పెరిగిపోతే గుండెజబ్బు లాంటి సమస్యలు వస్తాయి. మరి ఈ కొలెస్టరాల్ను తగ్గించుకోవడమెల? మన శరీరంలో కొవ్వు పెరిగిపోతే అది స్థూలకాయానికి దారి తీస్తుంది. దాన్ని అదుపులో ఉంచుకోకపోతే చాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కొవ్వును తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అసలు ఈ కొవ్వు ఎల తయారవుతుంది. దీన్ని ఎల తగ్గించుకోవాలి. చూద్దాం. మనం తినే ఆహారంలో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్ లు, పీచుపదార్థాలు, కొవ్వులు ఇల ఎన్నో పోషకాలు ఉంటాయి. మనం ఆహారం తిన్న తర్వాత దానిని అది మన శరీరం క్యాలరీల కింద మార్చుకుంటుంది. మనకు అవసరమైన దాని కంటే ఎక్కువ క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటే దాన్ని శరీరం కొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటుంది.…

Read More

ఎప్పుడు చలాకీగా, పని విషయం చాల చురుగ్గా ఉండే మహిళలు నెల నెలసరి సమయంలో మాత్రం కూర్చొన చోటు నుంచి లేవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కారణం అధిక రక్తస్రావం సమస్య. నిజానికి చాల మంది ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందైతే సమస్య తీవ్రంగా ఉంటే పనులేవి చేసుకోకుండా రెస్ట్ తీసుకుంటుంటారు. అయితే ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు. ప్రతి నెల ఇదే సమస్యతే మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు నిపుణులు. నెలసరి దగ్గర పడుతూంటే చాలు. అధిక రక్తస్రావం సమస్య ఉన్న మహిళల్లో కంగారు మొదలవుతుంది. అసలు రక్తస్రావం అధికంగా అవుతోందా? లేదా? అని తెలుసుకోవాలంటే ముందు సాధారణంగా ఎంత రక్తస్రావం అవ్వచ్చనే దానిపై అవగాహన ఉండాలి. సాధారణ నెలసరి అంటే నెలకు మూడు నుంచి ఐదు రోజుల కంటే ఎక్కువగా రక్తస్రావం కాకూడదు. ఈ సమయంలోనూ ఇరవై నుంచి అరవై మి.లీ. దాకా మాత్రమే…

Read More

చాలామంది మహిళలకు రుతుస్రావం సమయంలో నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి నొప్పి తీవ్రంగా ఉండి చాలా ఇబ్బంది కలుగజేస్తుంది. మెన్సెస్తో పాటు నడుం నొప్పి, వక్షోజాల నొప్పి కూడా రావచ్చు. పొత్తికడుపులో విపరీతమైన నొప్పి కూడా ఉండవచ్చు. పరిష్కారం : సరైన పోషకాహారం, సరళమైన వ్యాయామాలతో పీరియడ్ పెయిన్స్ నుండి ఉపశమనం పొందవచ్చు. వీటితో పాటు చిన్నచిన్న చిట్కాలు పాటించి చూడండి. పీరియడ్కు ముందు వారం రోజుల నుండి ఉప్పును తగ్గించండి. మాంసాహారం తక్కువగా తింటే మంచిది. అంటే వారానికి ఒక్కసారి మాత్రమే తినవచ్చు. మసాలా దినుసులు, కెఫేన్ ఉండే పానీయాలు అంటే టీ, కాఫీ, కొన్ని రకాల చాక్లెట్లు మరియు నూనె ఎక్కువగా వాడే వేపుళ్లు, వంటివి తినడం మానుకోవాలి. కొబ్బరి నీరు అధికంగా తాగితే మంచిది. నొప్పి అధికంగా ఉన్నప్పుడు కడుపు కింది భాగంపై వేడి నీళ్ల బాటిల్ పెట్టుకుంటే కొంచెం ఉపశమనం కలుగుతుంది. నడుము కింద తలగడ ఉంచుకోండి. ఉదయం పూట 10 తులసి ఆకులు నమిలి…

Read More

చాలామంది మహిళలకు రుతుస్రావం సమయంలో నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి నొప్పి తీవ్రంగా ఉండి చాలా ఇబ్బంది కలుగజేస్తుంది. మెన్సెస్తో పాటు నడుం నొప్పి, వక్షోజాల నొప్పి కూడా రావచ్చు. పొత్తికడుపులో విపరీతమైన నొప్పి కూడా ఉండవచ్చు. పరిష్కారం : సరైన పోషకాహారం, సరళమైన వ్యాయామాలతో పీరియడ్ పెయిన్స్ నుండి ఉపశమనం పొందవచ్చు. వీటితో పాటు చిన్నచిన్న చిట్కాలు పాటించి చూడండి. పీరియడ్కు ముందు వారం రోజుల నుండి ఉప్పును తగ్గించండి. మాంసాహారం తక్కువగా తింటే మంచిది. అంటే వారానికి ఒక్కసారి మాత్రమే తినవచ్చు. మసాలా దినుసులు, కెఫేన్ ఉండే పానీయాలు అంటే టీ, కాఫీ, కొన్ని రకాల చాక్లెట్లు మరియు నూనె ఎక్కువగా వాడే వేపుళ్లు, వంటివి తినడం మానుకోవాలి. కొబ్బరి నీరు అధికంగా తాగితే మంచిది. నొప్పి అధికంగా ఉన్నప్పుడు కడుపు కింది భాగంపై వేడి నీళ్ల బాటిల్ పెట్టుకుంటే కొంచెం ఉపశమనం కలుగుతుంది. నడుము కింద తలగడ ఉంచుకోండి.…

Read More

మన ఆహార విధానంలో వచ్చిన మార్పుల కారణంగా ఇప్పుడు అజీర్తి సమస్య సర్వసాధారణంగా కనబడుతున్నది. తీసుకునే ఆహారం, దినచర్యల వలన ఈ సమస్య చిన్నతనంనుంచే వేధిస్తున్నది. సరైన పద్ధతిలో కూర్చుని తినకపోవటం, సమయం తప్పితినటం, మధ్యరాత్రుల్లో తినటం, నిద్రలేకపోవటం ఇవన్నీ అజీర్తికి కారణాలు అవుతాయి. మరికొన్ని కారణాలు సరిగ్గా నమిలి తినకపోవటం, ఎక్కువగా తినటం, హడావుడిగా తినటం, నిలబడి తినటం పచ్చికూరగాయలు, పచ్చిపాలు, గుడ్లు వీటిని శరీరంతత్వం తెలుసుకోకుండా తిన్నపుడు పచ్చి కూరగాయలు, గింజధాన్యాలు మొదలైనవి తింటూ బరువు తగ్గించుకోవటం ఆరోగ్యరీత్యా అందరికీ ఆమోదయోగ్యం కాదు. పచ్చి కూరగాయలు ఎక్కువగా తీసుకోవటం వలన ఆకలి మందగించడం, జీర్ణకోశం, కిడ్నీలు, లివర్, గుండె వీటిపై ఆ ప్రభావం పడటం ఉంటుంది. పొత్తికడుపులో నొప్పి, తిన్న తరువాత కడుపు బరువుగా ఉండటం, గుండెల్లో మంట, వాంతి లక్షణాలు, పిత్తాశయం ద్వారా ఆపానవాయువు బయటకు రావటం నోరు రుచించకపోవటం నోటి నుంచి దుర్వాసన రావటం, కడుపు…

Read More