Author: apanalysis

మహిళలు వైద్యుల్ని సంప్రదించడానికి దారితీసే కారణాల్లో వైట్ డిశ్ఛార్జి కూడా ఒకటి. వినడానికి చిన్న విషయంగానే అనిపిస్తుంది కానీ.. కొన్నిసార్లు ఇది రకరకాల ఇన్ఫెక్షన్లకీ, క్యాన్సర్కీ సూచన కావచ్చు. అందుకే ఈ కింది కారణాల్లో ఏది కనిపించినా.. నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. శరీర సహజ పనితీరు వల్ల జరిగే వైట్ డిశ్ఛార్జికీ, మరేదయినా కారణంతో అది కనిపించడానికీ చాలా తేడా ఉంటుంది. ఈ సమస్యతో వైద్యుల్ని సంప్రదించినప్పుడు నడుమునొప్పీ, విపరీతమైన నీరసం, ఏ పనీ చేయలేకపోతున్నామని చెబుతుంటారు మహిళలు. వైట్ డిశ్ఛార్జి కావడం వల్లే ఇలా జరుగుతోందా అని సందేహిస్తారు. కొన్నిసార్లు ఇతర కారణాలూ ఈ సమస్యకు దారితీస్తాయి. అసలు వైట్ డిశ్ఛార్జి, ఎలా ఎందుకు అవుతుందంటే.. నోట్లో లాలాజలం, కంట్లో తడి పొర ఉన్నట్లుగానే యోనిలోనూ సహజమైన స్రావాలు ఉంటాయి. అవి గర్భాశయ ముఖ ద్వారం, యోని గోడలూ, యోని ద్వారంలో ఉండే బార్థోలిన్, చర్మంపై ఉండే…

Read More

ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ఆహారం, వ్యాయామాల పైనే దృష్టిపెడుతూ నిద్రకు సరైన ప్రాధాన్యం ఇవ్వటం లేదు. నిద్ర తగ్గటం వల్ల శారీరకంగా, మానసికంగా విపరీతమైన ఒత్తిడి పెరుగుతుందన్న సంగతిని విస్మరిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలం పాటు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే.. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్యల్ని పరిష్కరించే నేర్పు తగ్గటం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్థూలకాయం, మానసిక కుంగుబాట్లు, తరచూ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలన్నీ చుట్టుముడతాయి. నిద్రలేమి వల్ల వ్యక్తి రోజువారీ ఎదురయ్యే సాధారణ ఒత్తిడిని కూడా తట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటారు. దీనివల్ల చిరాకు, అసహనం, మూడీగా ఉండటం, దేనిపైనా మనసు పెట్టలేకపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. పరీక్షకు వెళ్లటానికి ముందు చాలామంది రాత్రంతా మేల్కొని చదివేస్తుంటారు. దీనివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. ఏదైనా నేర్చుకోవాలన్నా, జ్ఞాపకం పెట్టుకోవాలన్నా కంటి నిండా నిద్ర తప్పనిసరని తాజా అధ్యయనాల్లో తేల్చారు. చాలీ చాలని నిద్ర…

Read More

డాక్టర్ దగ్గరకు వెళ్లగానే.. స్టెతస్కోప్తో ‘లబ్-డబ్’లు వినటానికంటే ముందే.. మణికట్టు దగ్గర పట్టుకుని ఒక్క నిమిషం నాడి చూస్తారు. ఇలా చూస్తే ఏం తెలుస్తుంది? ‘నాడి’ మన వైద్యులకు ఏం చెబుతుంది? పూర్వకాలంలో కేవలం నాడి చూసే ఎన్నో వ్యాధులను గుర్తించేవారు. అన్ని విషయాలను చెబుతుందా మన నాడి? మన గుండె అత్యంత కీలకమైన అవయవం. అది బలంగా కొట్టుకున్న ప్రతిసారీ.. మన గుండెకు అనుబంధంగా శరీరమంతా ఉన్న రక్తనాళాలు కూడా ప్రభావితమవుతాయి. గుండె కొట్టుకోవటం, ఆ ఒత్తిడి తాలూకూ తరంగాలు రక్తనాళాల ద్వారా మన శరీరమంతా పాకుతాయి. దీన్నే మన వైద్యులు ‘నాడి’ చూడటం ద్వారా గుర్తిస్తారు. ఈ ఒత్తిడి తరంగాలను మణికట్టు దగ్గర, చంకల్లో, మెడ పక్కన, తొడలు, మోకాలు వెనకవైపు, పాదాల్లో స్పష్టంగా గమనించవచ్చు. ఈ నాడీ వేగం.. మన గుండె కొట్టుకుంటున్న వేగాన్ని సూచిస్తుంది. మణికట్టు దగ్గర నాడి తెలుసుకోవటం తేలిక. మణికట్టు కింద బొటనవేలు,…

Read More

ఓ గంటా, గంటన్నర సేపు వ్యాయామం చేశాక ఒళ్లంతా పట్టిన చెమటను తువాలుతో తుడుచుకుంటాం. చాలా సేపటి తరవాత స్నానం చేస్తాం. కానీ చర్మానికి పట్టిన చెమటా, ఆ వాసనా వదిలి తాజాగా మారాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామం అయిన వెంటనే చన్నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. దానివల్ల చెమటంతా పోతుంది. తరవాత మీ చర్మతత్వాన్ని బట్టి సబ్బుకి బదులు పండ్లతో చేసిన ఫేస్వాష్ రకాన్ని ఎంచుకోవాలి. దానివల్ల ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోయి చర్మం తాజాగా మెరుస్తుంది. వ్యాయామం చేసినప్పుడు చెమట వల్ల చర్మ గ్రంథులు పెద్దవవుతాయి. దుమ్మూ, మురికీ వాటిల్లో చేరి, చర్మం మెరుపు కోల్పోతుంది. మొటిమల్లాంటి సమస్యలు మొదలవుతాయి. ఆ సమస్యల్ని నివారించాలంటే క్లెన్సర్ వాడాలి. అందుకోసం క్రీం క్లెన్సర్ని వాడొచ్చు. లేదంటే పాలు రాసుకుని కాసేపయ్యాక దూదితో తుడిచేసుకున్నా సరిపోతుంది. ఇదయ్యాక ఏదయినా ఫేస్ప్యాక్ని వేసుకుంటే చర్మం మళ్లీ మృదువుగా మారుతుంది. మునుపటి తాజాదనాన్ని పొందుతుంది. …

Read More

భోజనం చేసేప్పుడు పావువంతు కడుపును ఖాళీగా ఉంచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కడుపునిండా తింటే ఆహారం సరిగా జీర్ణం కాకపోవటంతో పాటు ఒంట్లో కొవ్వు మోతాదూ పెరుగుతుందనేది అందులోని పరమార్థం. మరి అలా కొవ్వు పెరగకుండా చూసుకోవాలంటే ఆహారంలో వీటినీ భాగంగా చేసుకొని చూడండి. గుడ్లు: ఉదయం పూట ప్రోటీన్లను తీసుకుంటే చాలాసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అందువల్ల రోజూ గుడ్డు తినటం మంచిది. ఒక గుడ్డులో 75 కేలరీలే ఉంటాయి. ఇతర పోషకాలతో పాటు 7 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్ లభిస్తుంది. గుడ్డును జీర్ణం చేసుకునేప్పుడు శరీరం ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది కూడా. కొలెస్ట్రాల్ మోతాదు ఎక్కువగా గలవారు వారానికి ఎన్ని గుడ్లు తినొచ్చో డాక్టర్ని అడిగి తెలుసుకోవటం మేలు. ఆకుకూరలు: ఇవి విటమిన్ కె నిలయాలు. సాల్మన్ చేపలు: ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వీటితో దండిగా లభిస్తాయి. వెన్న తీసిన పాలు: ఇందులో ప్రోటీన్, క్యాల్షియం దండిగా…

Read More

అవసరానికన్నా అధికంగా తినటం అలవాటైన వారికి.. కడుపులో జీర్ణాశయం గోడలపై వాపు తరహా ఇన్ఫ్లమేషన్ తలెత్తి… అజీర్తి, ఆకలి పెరగటం, పేగుల్లో చిరాకు, బరువు పెరగటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఆహార అలవాట్లు, జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు తీసుకురావటం ద్వారా ఆరోగ్యంలో, శరీర ఆకృతిలో పెద్దపెద్ద మార్పులే తీసుకు రావచ్చంటున్నారు నిపుణులు. రోజూ గ్లాసుడు పచ్చి కూరగాయల రసం తాగటం శ్రేయస్కరం. క్యారెట్, ఉసిరి, కూరగాయల రసాల్లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఉత్తేజాన్నిస్తూ ఆహారాన్ని తేలికగా జీర్ణం చేస్తాయి. బీటాకెరటిన్, విటమిన్-సి, విటమిన్-ఇ, కూరగయాలు, గింజల్ని రోజువారీ ఆహారంలో తీసుకోవాలి. ఆరోగ్యంగా, చక్కగా ఉన్నారనేది శరీరాకృతి చక్కగా ఉండటం ఒక సంకేతం. తక్కువగా తినటం ద్వారా వృద్ధాప్య ఛాయలూ నెమ్మదిస్తాయి. సరిపడినన్ని మాంసకృత్తులు తీసుకోవాలి. ఇవి కణజాలానికి మరమ్మతులు చేస్తాయి. ఎముకల ఎదుగుదలను ప్రేరేపిస్తాయి. ఒత్తిడిని నియంత్రించాలి. వ్యాధులకు కారణమయ్యే వాటిలో మనసూ ముఖ్యమైనదే. ఒత్తిడి రోగ…

Read More

వయస్సులో ఉన్నప్పుడు ఏం తిన్నా.. ఎలా తిరిగినా రోజులు బాగానే గడిచిపోతాయి. ఆ ఉరకలెత్తే వయస్సులో శారీరక సామర్థ్యం అంత బాగా ఉంటుంది! కానీ 30లు దాటుతున్న కొద్దీ పరిస్థితి క్రమేపీ మారిపోతుంటుంది. ఎప్పుడూ లేనిది నెలకో రెణ్ణెల్లకో ఏదో ఒక చిన్నాచితకా ఆరోగ్య సమస్య పలకరించటం. మళ్లీ కొద్దిరోజుల్లో సర్దుకోవటం! చాలామందికి నలభైల్లో పడిన తర్వాత బండి ఇలాగే నడుస్తుంది! శరీరం కొద్దికొద్దిగా పట్టు సడలుతోందనటానికి ఇదే తార్కాణం. మరి దీన్ని అడ్డుకునేదెలా? 50, 60 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఎటువంటి శారీరక సమస్యా దరిజేరకుండా.. దృఢత్వం జారకుండా చక్కటి ఆరోగ్యాన్ని నిలబెట్టుకునేదెలా? అందుకోసం.. పాటించండీ ఈ ఐదు సూత్రాలు! ముప్ఫై ఏళ్లు దాటుతుంటే సహజంగానే స్త్రీపురుషులు ఇరువురూ కొద్దిగా బరువు పెరుగుతుంటారు. ముఖ్యంగా ప్రసవానంతరం స్త్రీలు కొంత బరువు పెరగటం చూస్తూనే ఉంటాం. అయితే ఏ రకంగా చూసుకున్నా కూడా బరువు పెరగటం మంచిది కాదు. అందుకోసం…

Read More

నాకు పెళ్లయి అయి 4 సంవత్సరాలు అయినా సెక్సువల్గా ఏమీ సంతృప్తి లేదు. అంగము బాగానే స్తంభిస్తుంది. యోని లోపలికి వెళ్ళినా కూడా ఏమీ ఎంజాయ్ మెంటు ఉండటం లేదు. నా భార్య కూడా ‘ఏమీ బాగాలేదు తీసెయ్యండి’ అంటుంది. ఇద్దరికీ తృప్తి ఉండటం లేదు. ఎంతసేపు చేసినా వీర్యస్ఖలనం కావటం లేదు. నాకు హస్తప్రయోగం అలవాటుంది. తృప్తి పడాలంటే నేను హస్తప్రయోగం చేసు కుంటాను. వెంటనే స్ఖలనమవుతుంది. రతి ఎంతసేపు జరిపినా స్ఖలనం కాదు. దయచేసి నా సమస్యకు సలహ చెప్పండి. మీరు వ్రాసిన సమాచారం చాలదు. మీ పూర్వ చరిత్ర గురించి మాకు కొన్ని విషయాలు తెలియాలి. మీ భార్యా భర్తల మధ్య అభిమానాలు, అభిప్రాయ భేదాలు దైనందిన సంబంధాలు ఎలా ఉన్నాయో, ఒకరి పట్ల ఒకరి వైఖరి ఏమిటో ఇద్దరినీ అడిగి తెలుసుకోవాలి. రతి అన్నా, ఆడవాళ్ళన్నా, ప్రత్యేకించి భార్య అన్నా మీకేమైనా అయిష్టం, అనాసక్తి ఉన్నాయా?…

Read More

నా వయసు 29 సంవత్సరాలు. నాకు పెళ్ళికి ముందు స్త్రీ అనుభవం బొత్తిగా లేదు. కాని పుస్తకాలు చాలా చదివాను. నాకు హస్త ప్రయోగం అలవాటు ఉంది. మొదటిరాత్రి నాకు ఏ విధమైన సంతోషం కాని, సంతృప్తి గాని కలగలేదు. ఆమె యోని లూజుగా, వక్షోజాలు మెత్తగా ఉన్నాయి. మొదటిసారి నేను ఆడదాన్ని అనుభవించినది ఆ మొదటి రాత్రియే. తొలిసారి యోనిలో ప్రవేశం కష్టంగా, బిగుతుగా ఉంటుందని ఎన్నోచోట్ల చదివాను. స్నేహితుల వద్ద విన్నాను. నా భార్యకు బాధ కలగలేదు కదా, ఆమె ముఖ కవళికలలో కూడా మార్పు కనిపించలేదు. ఒకవేళ నా అంగం చిన్నదిగా ఉండటం కారణమా? నా అంగం సన్నగా పొట్టిగా ఉంటుంది. సంసార యోగ్యతకు అంగం కనీసం ఎంత పొడవు, లావు ఉండాలి? నా భార్య పెళ్ళికి ముందే చెడిపోయిందని అనుమానంగా ఉంది. ఆమెకు విడాకులివ్వాలనుకుంటున్నాను. మీ సలహా ఏమిటో చెప్పగలరు. మీ అమాయకత్వానికి నవ్వాలో ఏడ్వాలో…

Read More

నెల నెల బహిష్టు అయినపుడు విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది. అలా 3 రోజులు వస్తుంది. మైలు 5,6 రోజులు అవుతుంది. నాకు 5 నెలల క్రితం నాకు పెళ్ళి అయ్యింది. పెళ్ళయిన 5వ రోజున మమ్మల్ని కలిపారు. కాని 7 రోజుల కొకసారి చొప్పున నేను భర్తతో కలిసినపుడు యోని లోపల నొప్పిగా మంటగా వుంటుంది. అలా 2,3 రోజులుంటుంది. వద్దంటున్నామా వారు ఒప్పుకోరు. ఆ టైములో నా బాధ పగ వాళ్ళకి వద్దనిపిస్తుంది. యోనిపై దురద, నొప్పి ఉంటుంది. ఈ సమస్య గూర్చి నేను చాలా వీక్ అయిపోతున్నాను. నా సమస్యకు సలహా ఇవ్వగలరు. ఋతు సమయంలో కడుపునొప్పికి రకరకాల కారణాలుంటాయి. హార్మోను హెచ్చుతగ్గులు కావచ్చు, పొత్తికడుపులో వ్యాధి ఉండటం కావచ్చు. చెప్పుకోదగ్గ కారణం ఏవిూ ఉండకనూ పోవచ్చు. ఒకసారి గైనకాలజిస్టుకి చూపించుకుంటే మందులు రాస్తారు. రతి సమయంలో యోని లోపల మంటకు కారణం సాధారణంగా యోని లోపల…

Read More