Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » రతిలో సుఖప్రాప్తి
for Couples

రతిలో సుఖప్రాప్తి

apanalysisBy apanalysisApril 2, 2020Updated:May 4, 2026No Comments14 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
సెక్స్పరమైన ఆలోచనలు కలిగినా, పురుషాంగానికి సెక్స్ప్రేరణ కలిగినా మెదడు నుండి పురుషాంగానికి సంకేతాలు చేరతాయి. ఆ నాడీ సంకేతాల ద్వారా పురుషాంగంలోని రక్తనాళాలు బాగా వ్యాకోచిస్తాయి. పురుషాంగంలోని టిష్యూల్లోకి రక్తం దూసుకుపోతుంది. క్షణాల్లో పురుషాంగం రక్తంతో నిండిపోయి లావుగా, పొడుగ్గా, గట్టిగా పెద్దదైపోతుంది. మెదడు నుంచి సంకేతాలు వెల్లువగా వస్తున్నంతసేపు పురుషాంగం స్తంభించే ఉంటుంది. వీర్యస్ఖలనం కావడంతో ఆ సంకేతాలు ఆగిపోతాయి. అయితే వీర్య స్ఖలనం అవడానికి కూడా మెదడు నుంచి వెలువడే నాడీసంకేతాలే మూలం. ఒక్కసారిగా వీర్యస్ఖలనం అవడంతో మెదడు నుంచి వచ్చే సంకేతాలు ఆగిపోయి రక్తనాళాలు సన్నబడిపోతాయి. దాంతో కొద్దిసేపటిలోనే అంగం చిన్నదైపోతుంది.సెక్స్ప్రేరణతో అంగం స్తంభించడానికి ఎంత తతంగం వుందో అంగం స్తంభించిన తర్వాత వీర్యస్ఖలనం అవడానికి కూడా అంత తతంగమే ఉంది. వైద్యభాషలో వీర్యస్ఖలనం అవడాన్ని ”ఇజాక్యులేషన్” అంటారు. ఇజాక్యులేషన్తో అద్భుతమైన మధురానుభూతి కలుగుతుంది. తనువు, మనస్సు ఎంతో సుఖానుభూతిని పొందుతాయి. వీర్యస్ఖలనంతో లభించే అద్భుతమైన ఈ సుఖానుభూతి వైద్య భాషలో ”ఆర్గజం” అంటారు. ఆర్గజంనే రతిలో సుఖప్రాప్తి అని చెప్పుకోవచ్చు

చిన్నపిల్లల్లో ‘డ్రై ఆర్గజమ్స్ :

యుక్తవయస్సు వచ్చిన తర్వాత సెక్స్ కోరికలు కలగడం, సెక్స్ప్రేరణ పొందడం, వీర్యస్ఖలనం అవడం, సుఖప్రాప్తి పొందడం సహజమైన విషయం. అయితే యవ్వన ప్రాయానికి ముందే చిన్నపిల్లల్లో కూడా వీర్య స్ఖలనం లేకుండా సెక్స్పరమైనటువంటి సుఖ ప్రాప్తి పొందే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇటువంటి పరిస్థితిని డ్రై ఆర్గజం అంటారు.

పెద్దవాళ్ళల్లో ‘డ్రై ఆర్గజమ్స్ :

చిన్నపిల్లల్లో డ్రై ఆర్గజం వున్నట్లుగానే సెక్సువల్గా అతిగా స్పందించే కొందరి పురుషులలో మొదటిసారి వీర్యస్ఖలనమై సుఖప్రాప్తి కలగగా ఆ తర్వాత కొద్దిసేపటిలోనే మళ్ళీమళ్ళీ అంగ స్తంభనలు కలగడం, రతిలో పాల్గొనడం, వీర్యస్ఖలనం కాకుండానే మధురానుభూతి పొందడం ఉంటుంది. ఇటువంటి డ్రై ఆర్గజమ్స్ కొద్దిమంది పెద్దవాళ్ళల్లోనే కలుగుతాయి. వీర్యస్ఖలనం ప్రోసెస్ చాలావరకు స్పైనల్ రిఫ్లెక్స్తో ముడిపడి ఉంటుంది. పురుషాంగానికి చేతి ద్వారా, అంగచూషణ ద్వారా, సెక్స్లో పాల్గొనడం ద్వారాగానీ తగిన ప్రేరణ కలిగిస్తే న్యూరల్ ఎగ్జైటేషన్ బాగా పెంపొంది ఆ ఫోర్సు మెదడుకి చేరి వీర్యస్ఖలనం అవడానికి కూడా కారణం అవుతుంది.

వీర్యస్ఖలనం అయ్యే విధానం :

వీర్యస్ఖలనం అవడానికి పెద్ద తతంగమే ఉందని ముందుగానే చెప్పుకున్నాం. ఈ తతంగం ముఖ్యంగా రెండు దశలుగా ఉంటుంది. 1) ఎమిషన్ ఫేజ్, 2) ఎక్స్పల్షన్ ఫేజ్.
వీర్యస్ఖలనం అవడానికి జరిగే మొదటి దశలో ప్రోస్టేటు గ్రంధి, సెమెనల్ వెసికల్స్, వాస్ డెఫరెన్స్ (వీర్యవాహికలు) ఈ మూడు గట్టిగా ముడుచుకుంటాయి. వాస్ డిఫెరెన్స్లో వీర్యకణాలు నిండుగా ఉంటాయి. సెమెనల్ వెసికల్స్ (శుక్రకణాలు),ప్రోస్టేటుగ్రంధిలో వీర్యానికి సంబంధించిన ద్రవం ఉంటుంది.సెక్స్పరమైన ప్రేరణ క్లైమాక్స్కి చేరుకుంటున్న సమయంలో పైమూడు గట్టిగా ముడచుకోవడంతో వాటిలోని ద్రవాలు ప్రోస్టేటు గ్రంధిలో నుంచి ప్రయాణించే మూత్రనాళంలోకి చేరుతాయి. బూరలాగా ఇక్కడ వుండే ఈ మూత్రనాళానికి క్రిందా, పైనా స్పింక్టర్స్ ఉంటాయి. ఈ స్పింక్టర్స్ బిరడా లాగా వుండి వీర్యం ఎటూపోకుండా అక్కడే నిల్వచేసి ఉంచుతాయి. ప్రోస్టేటు గ్రంధి భాగంలోని బూరలాగా వుండే మూత్రనాళం భాగంలోకి వీర్యద్రవం చేరినప్పుడు వీర్యస్ఖలనం అవబోయే సెన్సేషన్ మొదలవుతుంది

శీఘ్రస్ఖలనం అవడానికి కారణమేమిటి ?:

కొందరిలో ఈ సెన్సేషన్ అనిపించగానే క్షణాల్లో వీర్యస్ఖలనం అయిపోతుంది. మరి కొందరు కొద్దిసేపుపాటు వీర్యస్ఖలనం కాకుండా నిరోధించుకోగలుగుతారు.
వీర్యస్ఖలనంలో రెండవదశ అయిన ఎక్స్పల్షన్ ఫేజ్లో బూరలాగ వున్న మూత్రనాళం చుట్టూ వుండే కండరాలు గట్టిగా ముడుచు కుంటాయి. పురుషాంగంలో వుండే మూత్ర నాళంకూడా సన్నగా తయారవుతుంది. దానికి కారణం మూత్రనాళానికి సంబంధించిన కండరాలుముడుచుకోవడమే. ఇలా జరిగీ జరగడంతో ప్రోస్టేటు గ్రంధిలోని మూత్ర నాళానికి సంబంధించిన క్రింది స్పింక్టర్ ఒక్కసారిగా వదులు అయిపోతుంది. బూరలాగా వున్న మూత్రనాళంలోని వీర్యం గట్టిగా పిండేసినట్లు అవుతుంది. అలా పిండేయబడిన వీర్యం పురుషాంగంలోని మూత్రనాళం ద్వారా దూసుకుని బయటకు వచ్చినప్పుడు మూత్రనాళంలోని కామనాడులన్నీ ఒత్తిడికి గురిఅయ్యి అద్భుతమైన మధురానుభూతికి లోనవుతాయి. పురుషాంగంలోని, మూత్రనాళంలోని కామనాడుల మధురస్పందనతో అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఈ అనుభూతి 3 నుంచి 10 సెకండ్లపాటు ఉంటుంది.
వీర్యస్ఖలనం సమయంలో మూత్రం విడుదల కాకుండా మూత్రకోశం క్రిందనేఒక స్పింక్టర్ ఉంటుంది. వీర్యస్ఖలనం సమయంలో అది బిగుసుకుపోతుంది. ఈస్పింక్టర్నే ఇంటర్నల్ స్పింక్టర్ అంటారు. వీర్యస్ఖలనం సమయంలో ప్రోస్టేటు గ్రంధి క్రింద మూత్ర నాళానికి వుండే స్పింక్టర్ వదులవుతుంది. దాన్ని ఎక్సటర్నల్ స్పింక్టర్ అంటారు.

వీర్యస్ఖలనం లేకుండానే సెక్స్ ముగుస్తుందా ? :

కొందరు పురుషులలో సెక్స్లో పాల్గొన్నప్పుడు వీర్యం విడుదల అవదు. ఇటువంటి కేసుల్లో వీర్యం ఉత్పత్తి లేకపోవడం కాదు. వాళ్ళల్లో వీర్యస్ఖలనం సమయంలో మూత్ర నాళానికి సంబంధించిన క్రింది ఎక్సటర్నల్ స్పింక్టర్ ఓపెన్ కాకుండా ఉండిపోతుంది. మూత్రకోశం క్రింద వుండే స్పింక్టర్ మూసుకొని ఉండవలసిందిపోయి ఓపెన్ అయిపోతుంది. దాంతో పురుషాంగంలోని మూత్రనాళం ద్వారా బయటకు రావలసిన వీర్యం బయటకు రాకుండా పైకి ప్రయాణించి మూత్రకోశంలోకి చేరుకుంటుంది. బూరలాగా వుండే మూత్ర నాళంలోని వీర్యం ఖాళీ అయిపోవడంతో మెదడు నరానికి సంకేతాలు ఆగిపోయి అంగం మెత్తబడిపోతుంది. ఈ రకంగా క్రిందికి రాకుండా మూత్రకోశంలోకి వీర్యం చేరే పరిస్థితిని రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటారు.
రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ ప్రోస్టేటు ఆపరేషన్ అయిన వాళ్ళల్లో కనబడుతుంది. అలాగే ట్రాంక్విలైజర్స్, మత్తుబిళ్ళలు వాడేవాళ్ళల్లో కనబడుతుంది. రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ పరిస్థితి వున్నవాళ్ళల్లో సెక్స్ తర్వాత మూత్రాన్ని మైక్రోస్కోప్ క్రింద పరీక్షచేస్తే వీర్యకణాలు కనిపిస్తాయి.
కొందరికి నిద్రలో వీర్యస్ఖలనం అయిపోతుంది. స్త్రీలల్లో కూడా ఇలాంటి స్వప్నస్ఖలనాలు ఉంటాయి. అలా స్ఖలనం అయినప్పుడు మధురానుభూతి కూడా కలుగుతుంది. ఇటువంటి స్వప్నస్ఖలనాలకి మనస్సులో కలిగే ఫాంటసీలు కారణం.
ఓ వెరైటీ. సింపుల్ క్రేజ్తో మొదలైన వాళ్ళ క్రేజీలుక్స్ కామాన్ని సైలెంట్గా హైట్కి తీసుకువెళతాయి. వాళ్ళమధ్య కలిగే పరిణామాలు, వాళ్ళు చేసే యాక్షన్స్ కొత్తగా ఉంటాయి. ఇష్టపడిన అమ్మాయి ఎదురుగా వస్తున్నప్పుడు అబ్బాయి ఏదో పనిమీద వెళుతున్నట్లుగా వెళుతూ తన శరీరాన్ని ఆమె శరీరానికి తాకేలా చేస్తాడు. అలా తాకడం ఆ అమ్మాయికి కూడా ఇష్టమే. ఆ టచ్తో ఆ యంగ్ హర్ట్స్ రెండూ పులకరిస్తాయి. ఒళ్ళు జలదరిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య వున్న ప్రేమ మరింత పెరుగుతుంది.ఇదే ఓ నవదంపతుల విషయం తీసుకుంటే భర్త ముందు తానేదో వస్తువు అందుకునే దానిలా అతని మీదకు వంగి తన వక్షోజాలతో ఒరిపిడి కలిగిస్తుంది. అనుకోని ఆ సంఘటనకి ఆ కొత్త పెళ్ళికొడుకు హఠాత్తుగా రెచ్చిపోతాడు. ఆమెను దగ్గరకు లాగి గట్టిగా కౌగిలించుకుంటాడు. ఇద్దరిలోను కామం భగ్గుమంటుంది.
ఇద్దరూ చేయి చేయి కలిపి నడుస్తూ వున్న ఒకరి శరీరం మరొకరికి రాచుకునే లాగా ప్రవర్తిస్తారు. అలా చేస్తున్నట్లు ఇద్దరికీ తెలిసి వుండికూడా ఇద్దరు ఏమీ తెలియనట్లుగానే వ్యవహరించడం ఒక వింత. కాని ఆ టచ్ వాళ్ళల్లో కామాన్ని పెంచేస్తుంది. రెండు మబ్బులు ఢీకొంటే మెరుపు వచ్చినట్లుగా కామోద్రేకం శారీరక కలయిక కోసం తహతహలాడుతుంది.

నవ దంపతుల్లో కామోద్రేకానికి సోపానాలు :


సాధారణంగా ప్రేమి కులు గానీ, నవ దంపతులు గానీ ముద్దులతో మురిసి పోతారని అనుకుంటారు.ప్రేమికుల్లో ముద్దుకంటే ముందు బాగా కావాలని పించేది ఆలింగనం. ఈ ఆలింగనాలు రకరకాలుగా ఉంటాయి. ఒకరినొకరు స్పృశించడం, గట్టిగా నొక్కుకోవడం, గట్టిగా రాచు కోవడం, కావాలని కాలి బొటనవేలు తొక్కేయడం, చేతిని నలిపేయడం ఉంటాయి. ఆ తీయని బాధ వాళ్ళల్లో కలిగే కామాన్ని దూరతీరాలకి తీసుకుపోతుంది. అమ్మాయి తన చేతులతో పురుషుడిని బంధించి, గట్టిగా కౌగిలించు కుంటుంది. లత చెట్టుపైకి ఎగబ్రాకినట్లు తన ముఖాన్ని పైకెత్తి అబ్బాయి ముఖాన్ని క్రిందకు వంచి, గాఢంగా తన రొమ్ములని  అతనికి హత్తుకునేటట్లు చేసి, మత్తెక్కిన కళ్ళతో అతని ముఖంలోకి చూస్తూ స్థాణువులాగా ఉండిపోతుంది. ఆ రకంగా కలిగే కామం క్లైమాక్స్కి చేరుతుంది.ప్రేమికుల్లో తనువు తనువు తాకితే కలిగే గొప్ప తృప్తి పెదవులు రెండు కలిస్తే కలగదు. అందుకనే వారిలో కలిగే కామం కౌగిలింతకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. కామాన్ని ప్రేరేపించే ముద్దులు :
ప్రేమికుల్లో కౌగిలింత తర్వాత కామాన్ని పెంచేసేవి ముద్దులే. ముద్దు కేవలం పెదవులకే పరిమితం అనుకుంటే పొరపాటే అవుతుంది. శరీరంలో వివిధ ప్రదేశాలలో పెట్టే ముద్దు వివిధ రకాలుగా కామాన్ని కలిగిస్తుంది. నుదురు, ముంగుర్లు, బుగ్గలు, కళ్ళు, వక్షోజాలు, పెదవులు, నాలుక ఇవన్నీ ముద్దులతో పరవశించే ప్రాంతాలు. కామంతో రెచ్చిపోయే ప్రదేశాలు. స్త్రీ శరీరమంతా కామకేంద్రాలే. అందుకని నఖశిఖ పర్యంతం ముద్దులతో ముంచెత్తినప్పుడు ఆమె పరవశిస్తుంది. మునిపన్నుతో మృదువుగా రెండవవారి నాలిక నొక్కడం, పెదవి కొరకడం కామప్రేరణకి సోపానం అవుతుంది.

గోళ్ళ గాటు ఒక గొప్ప అనుభూతి :ప్రేమికులిద్దరు కామంతో కౌగి లింతలో ఒకటైనప్పుడు ఒకరినొకరిని గోళ్ళతో గిచ్చుకోవడం కూడా ఉంటుంది. మామూలు సమయంలో గిచ్చిన గోళ్ళబాధ కోపం తెప్పించ వచ్చు. కానీ శృంగారంలో కామం క్లైమాక్స్కి చేరడానికి సోపానం అవుతుంది. కామంతో మనస్సుమత్తుగా వున్నప్పుడు ఆ గోళ్ళ గాటుఒక తీయనిపోటుగా అనిపిస్తుంది. ఆ తీయని పోటు కామోద్రేకాన్ని మరింత రెచ్చగొడుతుంది. గోళ్ళగాటులాగానే పంటిగాట్లు కామంతో జ్వలించే ప్రేమికుల్లో ప్రత్యేకత కలిగి ఉంటాయి. పెదవుల మీద, బుగ్గల మీద, వక్షోజాల మీద పళ్ళతో మృదువుగా నొక్కడంతో కామం మరింత తీవ్రస్థాయికి  చేరుకుంటుంది.

మసక మసక చీకటిలో ముచ్చట్లు :

మసక మసక చీకట్లు తెలియకుండానే నవ దంపతుల మధ్య కామానికిప్రేరకాలు అవుతాయి. వింతేమిటో వెలుతురులో ఆస్వాదించని ప్రియురాలి చిరునవ్వుమసక మసక చీకటిలో మహ ముచ్చటగా కనబడుతుంది. ఆ చిరునవ్వు మనస్సుని ఇట్టే ఆకట్టుకుంటుంది. కామాన్ని ప్రజ్వలింపచేస్తుంది. ఆ చిరునవ్వు చిందించే ఆమె పెదవుల్లో కొద్దిపాటి వణుకు కానవస్తుంది. ఆ వణికే పెదవుల మధ్య నుంచి వెలువడే చిరునవ్వు మరింత రెచ్చగొట్టేదిగా ఉంటుంది. ఆ సమయంలో కొత్త పెళ్ళికొడుకు వెంటనే దగ్గరకు లాగేసుకుని ముద్దులతో ముంచెత్తాలని తహతహలాడు తాడు. కానీ కొత్త కొంత ఆపుతుంది. కొత్త పెళ్ళికొడుకు తన నోటితో లవంగాన్ని గానీ, యాలక్కాయని గానీ సగం కొరికి, తక్కిన సగం ఆమె నోటికి అందిస్తాడు లేదా ప్రక్కనే తాంబూలం వున్నట్లైతే సగం తాను కొరికి తక్కిన సగం ఆమె నోటికి అందిస్తాడు. ఆ ఎంగిలిని నవవధువు ఎంతగానో ఆస్వాదిస్తూ, లొట్టలేస్తూ ముచ్చటపడిపోతుంది. ఆ ముచ్చటతో ఆతనిలోని కామం, ఆమెలోని కామం రెండింతలు, మూడింతలు అయిపోతుంది. ఒక్కసారిగా అతను ఆమెను దగ్గరకు లాక్కుంటాడు. అతని కౌగిలిలో కరిగిపోతుంది. ఆ సమయంలో ఆమె ముఖంలోకి చూస్తే కళ్ళన్నీ మైకంతో నిండిపోయి ఉంటాయి. ముఖం అంతా బుసకొడుతున్న త్రాచులాగా తయారవుతుంది. దానికి కారణం కామోద్రేకంలో ముఖంలోని కండరాలన్ని పూర్తిగా స్పాజంకి లోనుకావడమే. ఆ ముఖ కవళికలు, కైపుకళ్ళు ఆమెకి ఏదో కావాలన్న కోరికని బలీయంగా వ్యక్తపరుస్తాయి. కామం క్లైమాక్స్ వాళ్ళిద్దరి శరీరాలని ఒకటి చేసేస్తుంది.
కొందరు మగవాళ్ళు స్త్రీతో మృదువుగా వ్యవహరించవలసిన వేళ చాలా మొరటుగా వ్యవహరిస్తారు. గట్టిగా నొక్కేయడం, ఊపిరి సలపని విధంగా గట్టిగా ముద్దులు పెట్టేయడం, గోళ్ళతో గిచ్చేయడం, పళ్ళతో కొరికేయడం చేస్తారు. కామంతో కసికసిగా అలా వ్యవహరించినా వ్యవహరం బెడిసికొడుతుంది. కామోద్రేకానికికూడా పరిమితులు ఉంటాయి. అవి తెలుసుకుని యుక్తిగా వ్యవహరించాలి. అప్పుడే నవ యవ్వనంలో వున్న కామం చక్కగా గుబాళిస్తుంది. ఆనందాన్ని అవధులు దాటిస్తుంది.
వయస్సులో వున్న స్త్రీలు ఆర్గజమిక్ ఫేజ్లో పలుమార్లు సుఖానుభూతి పొందడం వుండగా మెనోపాజ్ వచ్చిన స్త్రీలో సుఖానుభూతులు తక్కువ కలుగుతాయి.

తాపం కలిగించే కామం కమ్మదనాన్ని పెంపొందిస్తుంది :


కొత్తగా పెళ్ళి అయిన కొందరు అమ్మాయిలు తొలి కలయికల్లో చాలాబాధపడతారు. అంగప్రవేశం అలా దుర్లభం అనిపిస్తుంది. కానీ ఈ అమ్మాయిలే మనస్సుపడ్డ మగవానితో సెక్స్లో పాల్గొంటే సుఖానుభూతి వారి సొంతం అవుతుంది.సెక్స్లో పాల్గొనే ముందు మనస్సు పంచుకుని క్రేజీగా ఫోర్ప్లేలో పాల్గొంటే మనస్సు, తనువు పులకిస్తాయి. దాంతో యోని దగ్గర కండరాలు వదులైపోతాయి. యోని ద్వారం దగ్గర, యోని లోపల ద్రవాలు అధికంగా ఊరుతాయి. తాను మనస్సుపడ్డ మగవానితో మమైక్యం కావాలని, తహతహపడితే ఆమెలోని కామం తాపం కలిగిస్తుంది. ఆ కామతాపం జననేంద్రియాల దగ్గర వున్న కండరాలని వదులయ్యేటట్లు చేస్తుంది. దాంతో సునాయాసంగా అంగప్రవేశం జరుగుతుంది. అందుకనే నవ దంపతులు ఏదో ఆ కార్యం ముగించాలని డ్యూటీగా చేయడం కాకుండా క్రేజీ లుక్స్తో, క్రేజీ యాక్షన్స్తో దగ్గరైతే, పెల్లుబికిన కామం ఒంట్లోని కండరాలన్నింటినీ రిలాక్స్ చేసేసి అంగప్రవేశం జరిగేటట్లు చేస్తుంది.

కామోద్రేకాన్ని క్లైమాక్స్ తీసుకువెళ్ళే ఫోర్ప్లే :

కామోద్రేకాన్ని పెంచడంలో ఫోర్ప్లే ప్రధానపాత్ర వహిస్తుంది. ముద్దులు, కౌగిలింతలు, పరస్పరం జననేంద్రియాలని ప్రేరేపించు కోవడాలు, కామోద్రేకాన్ని క్లైమాక్స్కి తీసుకువెళ్ళడానికి గొప్పగా తోడ్పడతాయి. ఫోర్ప్లేతో మనస్సు పులకించినప్పుడు శారీరకంగా ఒకట వ్వడం అతి తేలికగా జరిగిపోతుంది. అంతేకాకుండా అంగ ప్రవేశం చక్కనిఅనుభూతులని కలిగిస్తుంది.

కామోద్రేకంతో పరిమాణం పెరిగే పురుషాంగం – ఓ మిస్టరీ ! :

మామూలు సమయంలో పురుషాంగం మూత్ర విసర్జనకు తోడ్పడే అంగం మాత్రమే. ఆ సమయంలో దాని పరిమాణం ఎంత వున్నదనేది ముఖ్యం కానేకాదు. మామూలు సమయంలో పురుషాంగం మెత్తదిగా, చిన్నదిగా, సన్నగా ఉంటుంది. ఆ సమయంలో 2-3 అంగుళాల పరిమాణం ఉంటుంది. సెక్స్ కోరిక కలిగినప్పుడే 4-6 అంగుళాల పరిమాణం పెరుగుతుంది.మూత్రకోశం దిగువ నుంచి ప్రారంభమైన మూత్రనాళం ప్రోస్టేటు గ్రంథి నుండి ప్రయాణించి పురుషాంగం ద్వారా బయటకు చేరుతుంది. ఆ రకంగా పురుషాంగం మామూలు సమయంలో మూత్రం బయటకు రావడానికి తోడ్పడుతుంది. సెక్స్లో పాల్గొన్నప్పుడు శుక్రకోశాలు ప్రోస్టేటు గ్రంథి విడుదల చేసే ద్రవాలు మూత్రనాళంలోకి చేరి పురుషాంగం ద్వారా బయటకు వస్తాయి.
పురుషాంగ నిర్మాణం ప్రత్యేకత కలిగి ఉంటుంది. పురుషాంగంలో ఎటువంటి ఎముక ఉండదు. మామూలు కండరం ఉండదు. స్పాంజి, ఇలాస్టిక్ గుణం కలిగినటిష్యూ ఉంటుంది. పురుషాంగానికి పైభాగంలో రెండు ప్రక్కల కార్పోరా కేవర్నోజ్టిష్యూ ఉంటుంది. పురుషాంగం క్రిందవైపు కార్పస్ స్పాంజియోజం అనే టిష్యూ ఉంటుంది. ఇందులోనే మూత్రనాళం ప్రయాణిస్తుంది. పురుషాంగంగా ఏర్పడిన ఈ స్పాంజి ఇలాస్టిక్ టిష్యూలు ఫైబ్రస్ పొరతో చుట్టబడి ఉంటాయి. దానిపైన మామూలు చర్మం ఉంటుంది. పురుషాంగం చివరిభాగం మెత్తగా, వుండలాగా ఉంటుంది. దీన్ని శిశ్నం అంటారు.
శిశ్నంమీద మూతగా ముందుకీ, వెనక్కి కదిలే పురుషాంగం పూర్వచర్మం ఉంటుంది. అరుదుగా కొందరిలో ఈ చర్మం శిశ్నాన్ని పూర్తిగా కప్పివుంచి, వెనక్కి కదలకుండా చేస్తుంది.
శరీరంలో తక్కిన భాగాలకి ధమనులు, సిరలు వున్నట్లే పురుషాంగంలోనూ రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలకి సున్నితమైన నాడులు సరఫరా అవుతాయి. పురుషాంగం దిగువభాగం పెల్విక్ బోన్కి అంటుకుని ఉంటుంది.
తేనె తుట్టులో గదులు ఎలా వుంటాయో పురుషాంగంలో వున్న కార్పోరా కండలో కూడా అనేక గదులు ఉంటాయి. మామూలు సమయంలో ఇవి దగ్గరై ముడుచుకుపోతాయి. సెక్స్పరంగా కోరిక కలగగానే మెదడు నుంచి పురుషాంగంలోని రక్తనాళాలకు నాడీ సంకేతాలు చేరుతాయి. పురుషాంగంలోని నరాలు రక్తనాళాలని ఉత్తేజపరుస్తాయి. దాంతో పురుషాంగంలో వున్న రక్తనాళాలు, రక్తపు గదులు వ్యాకోచిస్తాయి. ఇవి వ్యాకోచించడంతో రక్తం దూసుకుని వస్తుంది. బూరలోకి గాలి ఊదగా ఉబ్బినట్లు పురుషాంగంలోకి అధిక మొత్తంలో రక్తం దూసుకురావడంతో పురుషాంగ పరిమాణం గణనీయంగా పెరుగుతుంది.

సెక్స్ సంకేతాలతో పెరిగిపోయే పురుషాంగం :

స్త్రీ సెక్సీగా కనబడినా, పురుషాంగా నికి స్పర్శ తగిలినా మనస్సుని ఉద్రేకపరిచేసువాసనలు గుభాళించినా, ఉత్తేజపరిచే సంగీతం వీనులవిందు చేసినా, సెక్స్ పరమైనఊహలు మనస్సులో కలిగినా కామం ప్రజ్వరిల్లుతుంది. క్షణాల్లో పురుషాం గంలో మార్పులు చోటు చేసుకుంటాయి. అంగపరిమాణం పెరిగిపోతుంది. వయస్సు మళ్ళిన వారిలో ఎథిరోస్ల్కి రోసిస్ వల్ల రక్తనాళాలు గట్టిపడినా, మధుమేహంతో రక్తనాళాలు మొద్దు బారినా, స్మోకింగ్ వల్ల రక్తనాళాలుగట్టిపడినా, మద్యంవల్ల నరాలు దెబ్బతిన్నా అంగం సరిగ్గా స్తంభించదు.

కామం ప్రజ్వరిల్లిన పురుషునిలో కలిగే మార్పులు :

లైంగికంగా ఉద్రిక్తత చెందినప్పుడు రక్తాధిక్యతతో పురుషాంగం పొడవు పెరిగిపోతుంది. లావుగా మారుతుంది. స్త్రీలల్లో లాగా పురుషునిలో వక్షోజాల దగ్గరపరిమాణం పెరగడం కనబడకపోయినా, కొందరిలో చనుమొనలు నిగడబొడుచు కుంటాయి. ఛాతీమీద, భుజాలమీద, ముఖంమీద రాష్ కనబడుతుంది. ఎగ్జైట్మెంట్ దశలో సెక్స్ఫ్లెష్గా పేర్కొనబడే ఈ రాష్ వీర్యస్ఖలనం కలిగేవరకు వుండి, ఆపైన అదృశ్యం అవుతుంది.
కామం ప్రజ్వరిల్లినప్పుడు కండరాలు స్పాజంకు లోనవుతాయి. ముఖ్యంగా పాదాలు, కాళ్ళపిక్కలు బిగుసుకుంటాయి. సెక్స్ ఎగ్జైట్మెంట్లో శ్వాస ఎక్కువసార్లు తీసుకోవడం, కామోద్రేకం క్లైమాక్స్కి చేరి, వీర్యస్ఖలనం కాబోయేసరికి శ్వాస నిముషానికి 40 సార్లు తీసుకోవడం ఉంటుంది. మామూలుగా శ్వాస నిమిషానికి 16-18సార్లు తీసుకోవడం ఉంటుంది.
సెక్స్ తీవ్రతతో గుండె వేగం పెరుగుతుంది. సాధారణంగా నిముషానికి 70-80 సార్లు కొట్టుకునే గుండె కామోద్రేకం తీవ్రత బట్టి 100-170 సార్లు కొట్టుకుంటుంది. కామోద్రేకంతో వేడెక్కిపోయినప్పుడు రక్తపోటు కూడా పెరిగిపోతుంది. మామూలుగా 120/80 వుండే రక్తపోటు కామం క్లైమాక్స్లో 120 నుంచి 200కి పెరుగుతుంది.
ఆరోగ్యకరంగా వుండే వ్యక్తిలో కామోద్రేకం వల్ల అకస్మాత్తుగా రక్తపోటు పెరిగినా నష్టం ఉండదు. వీర్యస్ఖలనం కావడంతో రక్తపోటు క్షణాల్లో మామూలు స్థాయికి దిగిపోతుంది. కానీ సెక్స్లో పాల్గొన్నప్పుడు అలా రక్తపోటు పెరగడం మంచిదికాదు. అందుకని రక్తపోటు అధికంగా వున్నవారు మందులు వాడుతూ, ఎప్పుడూ దానిని నార్మల్గా ఉంచుకోవాలి. లేనిపక్షంలో కామోద్రేకంతో కాంప్లికేషన్లు కూడా కలుగుతాయి.

గుండెజబ్బు వున్నవాళ్ళు కామోద్రేకంతో రెచ్చిపోవడం ఎంతవరకు సబబు ? :

యాంజైనా గుండెజబ్బు వున్నవారు, లేదా ఇతర గుండెజబ్బులు వున్నవాళ్ళు సెక్స్లో పాల్గొన్నప్పుడు అంతగా ఎగ్జైట్ కావడం మంచిది కాదు. ఇటువంటి వాళ్ళు గుండెజబ్బు భయంతో సెక్స్కి దూరంగాఉండకూడదు. సెక్స్కి దూరంగా వుంటేన్షన్ పెరిగి, గుండెకు మరింత నష్టంకలుగుతుంది. సెక్స్లో పాల్గొంటేనేసాధారణంగా కలిగే టెన్షన్లు రిలీఫ్అవుతాయి. అందుకని యంజైనా, ఇతరగుండెజబ్బులు వున్నవాళ్ళు తాముఉద్రేకపడకుండా, హైరానా పడకుండాభార్యని యాక్టివ్ పార్టు తీసుకుని సెక్స్లో పాల్గొనమని కోరాలి.

ఆపరేషను అయినా అనుభూతులకి లోటు ఉండదు :

కొందరు స్త్రీలకి కొన్ని కారణాల వల్ల హిస్ట్రక్టమి ఆపరేషను చేయవలసివస్తుంది. ఈ ఆపరేషనులో గర్భసంచి తీసేస్తారు. ఇక బహిష్టులు రావడం ఉండదు.
సెక్స్ అనుభూతులలో గర్భాశయం పాత్ర ఉంటుంది. గర్భాశయాన్ని తీసే యడంతో లైంగికానందం తగ్గిపోతుందని చాలామంది భ్రమ చెందుతారు. గర్భా శయాన్ని తొలగించినప్పటికీ కామోద్రేకం కలగడంలోనూ, లైంగిక తృప్తి పొందడం లోనూ ఎటువంటి తేడా రాదు.కొందరైతే సెక్స్లో పాల్గొన్నప్పుడు గట్టిగా స్ట్రోక్స్ ఇస్తే ఆ దెబ్బ గర్భాశయ కంఠానికి తగిలి, దిమ్మతిరుగుతుందనుకుంటారు. నరాలు జివ్వుమంటాయ నుకుంటారు. వాస్తవానికి గర్భాశయం వున్నప్పటికీ సెక్స్లో పాల్గొన్నప్పుడు పురుషాంగం వెళ్ళి గర్భాశయ కంఠానికి తగలడం ఉండదు. పైగా కామం ప్రజ్వరిల్లి నప్పుడు గర్భాశయానికి సంబంధించిన లిగమెంట్లు గర్భాశయాన్ని పైకి గుంజేస్తాయి. సెక్స్లో గట్టిగా స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు శిశ్నానికి ఏదైనా గట్టిగా తగిలినట్లు అనిపిస్తే అది యోని వెనుకభాగంలో వున్నటువంటి పెల్విక్ బోన్ శాక్రంకి తగలడం వల్లనే. అంతేతప్ప పురుషాంగం గర్భాశయ కంఠాన్ని ఢీ కొట్టడం కాదు.

పెద్దాపరేషను అయిన స్త్రీలో అనుభూతుల రహస్యం :

తక్కిన స్త్రీలల్లో లాగానే హిస్టరెక్టమి ఆపరేషను అయిన స్త్రీలో కామం మామూలుగానే ఉంటుంది. కామం ప్రజ్వరిల్లినప్పుడు కలిగే నాలుగు దశలూ ఉంటాయి. దాంతో లైంగికానందంలో, లైంగిక అనుభూతులలో ఎటువంటి కొదువా ఉండదు.సెక్స్పరంగా గుర్తింపు పొందే మొదటి దశని ఎగ్జైట్మెంట్ ఫేజ్ అంటారు. ఎగ్జైట్మెంట్ ఫేజ్లో పురుషాంగం ప్రమేయం లేకుండానే యోనిమార్గం పొడవు అవుతుంది. యోని మార్గం పొడవు అవడానికి యోనిలో వుండే కండరాలు సాగి, పొడుగు అవడమే కారణం. సెక్సువల్ ఎగ్జైట్మెంట్ ఫేజ్లో యోని మార్గంపొడవు అవడమే కాకుండా, విచ్చుకుని విశాలంగా మారుతుంది. ఎగ్జైట్మెంట్ ఫేజ్లో గర్భాశయం పైకి గుంజబడుతుంది. దాంతో యోని మార్గం మరింత పొడవు అవుతుంది. ఈ రకంగా ఎగ్జైట్మెంట్ ఫేజ్లో పురుషాంగ ప్రవేశం జరగకుండానే యోనిమార్గం పొడవు 11-12 సెం.మీ. పెరుగుతుంది. మామూలుగా యోనిమార్గం 8 లేదా 9 సెం.మీ. పొడుగు ఉంటుంది.
యోని మార్గంలోని కండరాలు బాగా సాగేగుణం కలిగి వుండటంతో పురుషాంగ ప్రవేశంతో 18-20 సెం.మీటర్లు పొడవు అవుతుంది. యోని పొడవు అయిన కొద్దీ యోని వెడల్పు కూడా పెరుగుతుంది.కామోద్రేకంతో రగిలిపోతున్న స్త్రీలో రెండవ దశ ప్లాటో ఫేజ్ మొదలవుతుంది. ఈ రెండవ దశలో కామోద్రేకం మరింత ప్రజ్వరిల్లడమే కాకుండా ఆ మూడ్ని నిలకడగా కొన్ని నిముషాల పాటు క్లైమాక్స్లో ఉంచుతుంది. కామోద్రేకం అధికం అవడంతో ద్రవాలు కూడా యోనిలో అధికంగా స్రవిస్తాయి. యోనిమార్గం గోడలు రక్తాధిక్యతతో ఉబ్బిపోయి, ఉబ్బిన స్పాంజిలాగా మెత్తగా తయారవుతాయి. యోని గోడలలో రక్తాధిక్యత పెరగడంతో కామం ప్రజ్వరిల్లిన స్త్రీలో నులివెచ్చని అనుభూతి, చెప్పలేని హయిని కలిగిస్తుంది.

శిఖరాగ్రానికి చేరిన కామం :

కామం శిఖరాగ్రానికి చేరడంతో ఆర్గజమిక్ ఫేజ్కలుగుతుంది. క్లైమాక్స్కి చేరిన సెక్స్ స్పందనలుయోని మార్గంలోని గోడల్లో ప్రత్యేక సంచలనాలనికలుగచేస్తాయి. పెద్దాపరేషను అయ్యి,గర్భాశయాన్ని తీసేసినప్పటికీ యోనిగోడలలోకి ఈ ప్రత్యేక సంచలనాలు ఏమాత్రం తగ్గవు. కామోద్రేకం క్లైమాక్స్లోయోని మార్గంలోని కండరాలు లయబద్ధంగాముడుచుకోవడం, సాగడంతో తీయనిఅనుభూతులు, సుఖానుభూతులుకలుగుతాయి.కంట్రాక్షన్కికంట్రాక్షన్కి మధ్యక్షణకాలంపాటు విరామం వస్తుంది. ఈ రకంగా కామోద్రేకం క్లైమాక్స్లో 10-15సార్లు మధురమైన కండర సంకోచాలు కలుగుతాయి.
ఆర్గజమిక్ ఫేజ్ ప్రారంభదశలో 5 లేదా 6 కండర సంకోచాలు స్ట్రాంగ్గా వుండి, సెక్స్ అనుభూతిని టాప్కి తీసుకువెళతాయి. మొదటి కండర సంకోచాలు త్వరత్వరగా జరిగి, ఆ తర్వాత సంకోచాలు ఎక్కువ గ్యాప్తో కలుగుతాయి. ప్రతీ కలయికలో ఒకే విధంగా సుఖానుభూతులు కలగాలని లేదు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా ఉంటాయి. సుఖానుభూతి తీవ్రతలో కూడా తేడా కనబడుతుంది. అలాగే సుఖానుభూతులు  కలగడంలో ఒక స్త్రీకి, మరొక  స్త్రీకి తేడా ఉంటుంది. ఆర్గజమిక్ ఫేజ్లో సుఖానుభూతి కలగడంతో చెలరేగిన కామోద్రేకానికి ముగింపు వస్తుంది. 3-4 నిముషాలలో యోని మార్గం పొడవు, వెడల్పు మామూలు స్థితికి వచ్చేస్తాయి. 10-15 నిముషాల్లో యోనిమార్గంలో కలిగిన రక్తాధిక్యత తగ్గిపోతుంది.కామం

ప్రజ్వరిల్లిన స్త్రీలో కనబడే మార్పులు :

చాలామంది పురుషులకి సెక్స్లో పాల్గొన్నప్పటికీ ఆ స్త్రీ తృప్తి చెందిందా, లేదా అనేది తెలియడం లేదని అంటూ ఉంటారు. ఒకవేళ ఆ పురుషుడు ”నీకు తృప్తి కలిగిందా, నా వల్ల సుఖం అనిపించిందా ?” అని అడిగితే చాలా సందర్భాలలో మౌనమే సమాధానం అవుతుంది. ఆ మౌనాన్ని పాజిటివ్గా తీసుకోవాలో, నెగటివ్గా తీసుకోవాలో తెలియక తికమక అవడం కూడా ఉంటుంది.స్త్రీలల్లో సుఖప్రాప్తి అనేది శారీరక, మానసిక ఉద్వేగాల సమ్మేళనం. సుఖప్రాప్తి అనేది మాటలకి అందని మధురమైన అనుభూతి. అయినప్పటికీ సుఖప్రాప్తి పొందుతున్నప్పుడు స్త్రీలల్లో కొన్ని ప్రత్యేక శారీరక స్థితిగతులు ఏర్పడతాయి. వీటినే ఫిజియోలాజికల్ ఛేంజెస్ ఆఫ్ సెక్స్ అంటాము.
సుఖప్రాప్తి మనస్సుకో, యోనికో పరిమితం కాదు. సుఖప్రాప్తి అనేదిటోటల్ బాడీ రెస్పాన్స్. సెక్స్ క్లైమాక్స్ లో పొందే తీయని అనుభూతిలో శరీరంలోని ప్రతిభాగం, ప్రతి అణువు పాలుపంచుకుని భాగస్వామ్యం అవుతాయి. సుఖప్రాప్తి దశలో శరీరంలోని కండరాలన్ని బిగుసుకుంటాయి. దీన్నే మయోటోనిక్ టెన్షన్ అంటారు. ఈ మయోటోనిక్ టెన్షన్ సుఖప్రాప్తి పొందే సమయంలో స్త్రీ ముఖంలో స్పష్టంగా కానవస్తుంది. ఆ  సమయంలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో మార్పులు స్పష్టంగా చోటు చేసుకుంటాయి. కామోద్రేకం క్లైమాక్స్కి చేరిన దశలో స్త్రీ చేతులు, కాళ్ళు కండరాలు బిగుసుకుంటాయి. మెడ దగ్గర కండరాలు కూడా బిగుతుగా మారతాయి.మామూలుగా పెద్ద కండరాల సంకోచ, వ్యాకోచాలు వ్యక్తి ఆధీనంలో ఉంటాయి. కానీ కామోద్రేకం క్లైమాక్స్కి చేరినప్పుడు కండరాలపైన సెల్ఫ్ కంట్రోలు లేకుండాపోతుంది. వాటంతటకవే బాగా స్టిఫ్గా మారతాయి. అలా స్టిఫ్గా మారిన కండరాలు సుఖప్రాప్తి పొందడంతో ఒక్కసారిగా పట్టు సడలుతాయి.
కామోద్రేకం క్లైమాక్స్ చేరిన దశలో స్త్రీ చేతులు బిగుసుకుంటాయి. చేతులు గట్టిగా బెడ్ని పట్టుకుంటాయి. లేదా సెక్స్లో పాల్గొన్న పురుషుడిని పెనవేసుకుని అదిమి పట్టుకుంటాయి. అలాగే కాళ్ళు రెండు పురుషుడిని పెనవేసుకుంటాయి. పాదాలు బిర్రుగా మారతాయి. దాంతో పాదాలు వెనక్కి తన్నుకుని ఉంటాయి. మోకాళ్ళ దగ్గర కాళ్ళు ముడుచుకున్న పొజిషన్లో వుంటే కాళ్ళ వేళ్ళు బెడ్లోకి నొక్కుకుపోగా మడమలు మాత్రం బెడ్కి ఆనకుండా పైకి లేస్తాయి. వక్షోజాలు గట్టిగా మారతాయి. ముఖ్యంగా పిల్లలు లేని, బిడ్డకు పాలివ్వనిస్త్రీలల్లో వక్షోజాలు బిర్రుగా తయారవుతాయి. చనుమొనలు నిక్కబొడుచుకుంటాయి. చనుమొనలు చుట్టూవుండే ఏరియోలా టైట్గా మారుతుంది. సెక్స్లో సుఖప్రాప్తికి చేరిన స్త్రీ శరీరం మీద కుంకుమ చల్లినట్లు ఎర్రని రాష్ కనబడుతుంది. ఫెయిర్ కంప్లెక్స్ వున్న స్త్రీలల్లో ఇటువంటి రాష్ కనబడటం ఎక్కువ. కామోద్రేకం చల్లబడటంతో రాష్ కూడా  అదృశ్యం అవుతుంది. కామోద్రేకం క్లైమాక్స్కి చేరిన స్త్రీలో ఉచ్ఛ్వాస, నిశ్వాసలు ఎక్కువ అవుతాయి. మామూలుగా నిముషానికి 18 సార్లు ఊపిరి తీయగా కామోద్రేకం క్లైమాక్స్లో నిముషానికి 40 సార్లు వడివడిగా, వేడివేడిగా ఊపిరితీయడం ఉంటుంది.

అయిపోయినా ఆన్లోనే… :

స్త్రీకి సుఖప్రాప్తి విషయంలో ప్రత్యేకత ఉంటుంది. స్త్రీలో ఆర్గజమిక్ ఫేజ్లో సుఖానుభూతులు పొందడం పూర్తి అయినప్పటికీ  పురుషుడు సెక్స్ని కంటిన్యూ చేసినా లేదా వేలితో స్టిమ్యులేట్చేసినా ఆమెలో అయిపోయిందనుకున్న సుఖానుభూతి ఆస్వాదన మళ్ళీ వేగం పుంజుకుంటుంది. తిరిగి పూర్వంలాగానే సెక్స్  స్టిమ్యులేషన్తో సుఖానుభూతులుపొందడం ఉంటుంది. పురుషుని విషయంలో ఒకసారి సుఖానుభూతి పొందిన తర్వాత ఇది సాధ్యం కాదు. పురుషునిలో వీర్యస్ఖలనం కావడానికి 2-3 సెకండ్ల ముందు వీర్యం పడిపోతుందని తెలిసినట్లుగానే స్త్రీలల్లో కూడా సుఖానుభూతి కలగడానికి 2-4 సెకండ్ల ముందు తెలుస్తుంది. దాంతో  సుఖానుభూతిని ఆస్వాదించడానికి మనస్సు మరింతగా సమాయత్తమవుతుంది. శారీరక కలయికలో ఎటువంటి శారీరక మార్పులు ఏర్పడతాయో దాదాపు అదే విధంగా స్త్రీ హస్తప్రయోగంలో, ఫాంటసీ ఆలోచనల్లో పొందడం ఉంటుంది. కానీ సుఖప్రాప్తి స్థాయిలో కొంత తేడా ఉంటుంది.

ప్రత్యేక పరిస్థితిలో కామోద్రేకం పరిణామాలు :

కొందరు స్త్రీలకి గర్భందాల్చిన మొదటి నెలల్లో థ్రెటెండ్ అబార్షన్ పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి వున్నవాళ్ళల్లో గర్భాశయం బిగదీయడం, అప్పుడప్పుడు రక్తస్రావం అవడంతో గర్భం పోతుందా అని భయం కలగడం ఉంటుంది. ఇటువంటి స్త్రీలు కామోద్రేకం విషయంలో కంట్రోలులో వుండటం అవసరం. సెక్సువల్గా ఎగ్జైట్ అయితే గర్భాశయం మరింత వ్యాకోచ సంకోచాలకి గురై గర్భంపోయే అవకాశం ఉంది. అందుకని థ్రెటెండ్  అబార్షన్ పరిస్థితి మందులతో చక్కబడే వరకు సెక్స్ సంబంధాలకి దూరంగా వుండటం, సెక్స్పరంగా ఉద్రిక్తత చెందకుండా వుండటం అవసరం.
గర్భస్రావ పరిస్థితి లేనప్పుడు కామపరంగా ఎంత ఉద్రిక్తత చెందినా, 8వ నెల నిండేవరకు రతిలో పాల్గొన్నా ఎటువంటి నష్టం కలగదు.

మెనోపాజ్ వచ్చిన స్త్రీలో కామోద్రేకం :

మెనోపాజ్ వచ్చినప్పటికీ సెక్స్ కోరికలు మామూలుగానే ఉంటాయి. సెక్స్ స్పందనలు మామూలుగానే ఉంటాయి. కామోద్రేకం క్లైమాక్స్కి చేరి మధురానుభూతులు కలిగించడం కూడా మామూలుగానే ఉంటాయి. మెనోపాజ్ వచ్చిన కొందరు స్త్రీలల్లోనే కామం తగ్గిపోతుంది. కామోద్రేకం అంతగా ఉండదు. దానికి కారణం వారిలో ఈస్ట్రోజన్ హర్మోను తగ్గిపోవడమే. మెనోపాజ్ వచ్చిన స్త్రీలో యోని గోడలు పలచన అవుతాయి. కామం, కామోద్రేకం మామూలుగానే వున్నప్పటికీ లైంగికంగా ఒకటవ్వడంతో నొప్పి, మంట కలగవచ్చు. ఇలా నొప్పి, మంట కలిగే స్త్రీలు  ఈస్ట్రోజను క్రీము రెగ్యులర్గా యోనిలో రాయడం వల్ల యోనిమార్గంలో పొరలు ఆరోగ్యంగా మారతాయి.
Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

కామోద్రేకం కలిగినప్పడు స్త్రీల శరీరంలో కలిగి మార్పులు

December 2, 2025

దంపతుల మధ్య బంధం మరింత బలపడేందుకు

May 19, 2022

అంగస్తంభనలో పురుషాంగ పాత్ర

April 2, 2020

సున్తీ పురుషునిలో సెక్స్ తృప్తిని పెంచుతుందా ? – అనుమానాలు అపోహలు

April 2, 2020

పురుషాంగ పరిమాణం బట్టి స్త్రీలకి తృప్తి – అనుమానాలు అపోహలు

April 2, 2020

పురుషాంగ పరిమాణం బట్టి స్త్రీలకి తృప్తి – అనుమానాలు అపోహలు

April 2, 2020
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.